యూజర్ల సమాచారాన్ని దోచుకుంటున్న యాప్స్‌ను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు గూగుల్ వాటిని నిషేధిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయా యాప్స్ యూజర్ల ఫోన్లో ఉంటే వారి వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం గ్యారంటీ. దీంతో ప్రమాదకరమైన మాల్వేర్ యాప్‌లపై గూగుల్ నిషేధం విధిస్తుంది. తాజాగా మరో ఐదు డేంజర్ యాప్స్‌ను గూగుల్ గుర్తించింది. ఈ యాప్‌లు స్పైవేర్ యాప్‌లుగా పనిచేస్తూ యూజర్ల సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు గూగుల్ దృష్టికి వచ్చింది. అందుకే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐదు యాప్‌లను గూగుల్…
ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ తన గేమింగ్ సర్వీస్ కోసం కొత్త గేమ్‌లను ప్రకటించింది, అవి ‘ది క్వీన్స్ గాంబిట్,’ ‘షాడో అండ్ బోన్,’ ‘టూ హాట్ టు హ్యాండిల్’ మరియు ‘మనీ హీస్ట్’ వంటి కొన్ని ప్రసిద్ధ టీవీ షోలతో ముడిపడి ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం 22 గేమ్‌లను అందిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి 50 టైటిల్స్‌ను కలిగి ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ వారం ‘గీక్డ్ వీక్’ ఈవెంట్లో, కంపెనీ రాబోయే గేమ్‌ల…
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (IIT-K), క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా మోసానికి సంబంధించిన కేసులను గుర్తించడంలో మరియు ఛేదించడంలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు సహాయపడేందుకు దేశీయంగా రూపొందించిన సాధనాన్ని అందజేస్తుంది. ఐఐటీ కాన్పూర్ నుండి ప్రొఫెసర్ సందీప్ శుక్లా మాట్లాడుతూ.. హోప్ (HOP) అని పిలువబడే ఐఐటీ అభివృద్ధి చేసిన సాధనం క్రిప్టోకరెన్సీ లావాదేవీలను విశ్లేషించగలదన్నారు. ఈ సాధనం మిగితా విదేశీ పరికరాల కంటే చౌకైనదని ఆయన వెల్లడించారు. సెప్టెంబరు నాటికి, మా టూల్ యూపీ పోలీసులకు…
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత నవంబర్ నెలలో ఎయిర్టెల్ తన రీచార్జ్ ప్లాన్లను పెంచిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరోసారి రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్టు ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విట్టల్ మాటలను బట్టి తెలుస్తోంది. 2022లోనూ చార్జీలను పెంచనున్నట్టు ఆయన స్పష్టంగా చెప్పారు. మార్చి చివరికి ఎయిర్ టెల్ కు ఒక్కో యూజర్ నుంచి ప్రతినెలా సగటున రూ.178 ఆదాయం వచ్చిందన్న గోపాల్…
టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో మోసాలకు కొత్తకొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు.. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై జనాలు ఏ రేంజ్లో ఆధారపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ షాపు నుంచి ఫ్లైట్ బుకింగ్ వరకు యూపీఐ పేమెంట్లు జరుగుతున్నాయి. అయితే దీన్నే అవకాశంగా తీసుకోని కొన్ని సార్లు మోసాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ పే కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌లో ఇక నుంచి లావాదేవీలు అంటే డబ్బులు పంపినా లేక చెల్లించినా మీకు పంపిన వారి ఒరిజినల్ పేరు…
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని పదిలపరుచుకుని యూజర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ సహాయంతో 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం యూజర్లకు వాట్సాప్ అందించనుంది. ప్రస్తుతానికి 100 ఎంబీ కన్నా ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ షేర్ చేసుకునేందుకు వాట్సాప్‌లో అవకాశం లేదు. దీంతో పెద్ద సైజ్ ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని…