Huawei Mate 80 Series: చైనా టెక్ దిగ్గజం హువావే తాజాగా Huawei Mate 80 Series ను అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో నాలుగు శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ మోడళ్లు Mate 80, Mate 80 Pro, Mate 80 Pro Max, Mate 80 RS Master Edition లను అందుబాటులోకి తీసుకవచ్చారు. కొత్త Kirin చిప్‌సెట్స్, HarmonyOS 6.0, 20GB వరకు RAM, 1TB స్టోరేజ్, Kunlun గ్లాస్ ప్రొటెక్షన్, IP68/IP69 రేటింగ్‌లు, అద్భుతమైన కెమెరా టెక్నాలజీ వంటి పలు ప్రీమియమ్ ఫీచర్లతో ఈ ఫోన్లు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ మొబైల్ లో ఎలాంటి ఫీచర్లున్నాయో ఒకసారి చూద్దామా..
Mahavatar Narsimha : ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..!
Huawei Mate 80 Pro Max:
ఈ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్ Mate 80 Pro Max. ఈ మొబైల్ 6.9 ఇంచుల LTPO AMOLED డిస్‌ప్లే, Kunlun గ్లాస్ 2 ప్రొటెక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు IP68/IP69 డ్యూయల్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. koth Kirin 9030 Pro చిప్‌సెట్ ఈ ఫోన్‌కు మంచి మెరుగైన పనితీరు ఇస్తుంది. ఇక కెమెరా విభాగంలో 50MP RYYB ప్రధాన కెమెరా, 40MP అల్ట్రావైడ్, రెండు 50MP టెలిఫోటో లెన్స్‌లు, రెండో తరం Red Maple కలర్ సెన్సార్ వంటి అత్యుచ్ఛమైన సెటప్ అందుబాటులో ఉంది. అలాగే ఇందులో బ్యాటరీగా 6000mAh కెపాసిటీతో పాటు 100W వైర్డ్, 80W వైర్లెస్ వేగవంతమైన చార్జింగ్ సపోర్ట్ ఇది ప్రత్యేకత. ఇక వీటి ధర విషయానికి వస్తే.. 16GB + 512GB మోడల్ రూ. 1,00,500, 16GB + 1TB రూ.1,13,000గా నిర్ణయించారు.

Huawei Mate 80 Pro:
Mate 80 Pro కూడా మంచి పనితీరు అందించే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఇందులో 6.75 ఇంచుల AMOLED డిస్‌ప్లే, Kunlun Glass 2 రక్షణ, Kirin 9030 Pro చిప్‌సెట్, 50MP ప్రధాన కెమెరా, 40MP అల్ట్రావైడ్, 48MP మాక్రో టెలిఫోటో కెమెరాతో ఇది ఫోటోగ్రఫీ ప్రేమికులకు మంచి ఛాయస్ గా మారనుంది. అలాగే ఇందులో 5500mAh బ్యాటరీతో 100W వైర్డ్, 80W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఈ మోడల్ 12GB + 256GB రూ.75,000, 12GB + 512GB రూ.81,000, 16GB + 512GB రూ.87,000, 16GB + 1TB వేరియంట్ రూ.1,00,500 గా నిర్ణయించారు.

Huawei Mate 80:
Mate 80 మోడల్ 6.75 ఇంచుల AMOLED డిస్‌ప్లే, Kirin 9020 Pro చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. 50MP వేరియబుల్ అపర్చర్ కెమెరా, 40MP అల్ట్రావైడ్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలతో అద్భుతమైన కెమెరా అనుభవం అందిస్తుంది. అలాగే 5,500mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ చార్జింగ్, 50W వెయ్యర్‌లెస్ చార్జింగ్ ఇవి దీనిని ప్రీమియమ్ కేటగిరీలో నిలబెడతాయి. ఇక ఈ మొబైల్ డాన్ గోల్డ్, ఒబిసిడియన్ బ్లాక్, సనౌయి వైట్, స్ప్రూస్ గ్రీన్ రంగులలో లభిస్తుంది. ఇక వీటి ధర విషయానికి వస్తే.. 12GB + 256GB రూ.59,000, 12GB + 512GB రూ.65,000, 16GB + 512GB రూ.69,000గా నిర్ణయించారు.
Delhi: భారత్‌పై ఇథియోపియాలో బద్దలైన అగ్నిపర్వతం ప్రభావం !
Huawei Mate 80 RS Master Edition:
సిరీస్‌లో అత్యంత ప్రీమియమ్ మోడల్ RS Master Edition. ఈ మొబైల్ 6.9 ఇంచుల LTPO AMOLED స్క్రీన్, బసాల్ట్ టెంపరడ్ కున్లున్ గ్లాస్ 3, మెరుగైన Kirin 9030 Pro, 20GB RAM, 1TB స్టోరేజ్ వంటి టాప్-ఎండ్ స్పెసిఫికేషన్లు అందిస్తుంది. ఇందులో కెమెరాలుగా 50MP ప్రైమరీ, 40MP అల్ట్రావైడ్, 50MP మాక్రో టెలిఫోటో, 50MP టెలిఫోటో లెన్స్‌లు అమర్చారు. ఇక 6000mAh బ్యాటరీతో 100W వైర్డ్, 80W వైర్లెస్ చార్జింగ్ లభ్యం కానుంది. ఈ మొబైల్ 20GB + 512GB రూ. 1,50,000, 20GB + 1TB రూ.1,63,000 గా నిర్ణయించారు. మొత్తంగా, హువావే కొత్త Mate 80 సిరీస్ ప్రీమియమ్ డిజైన్, టాప్ క్లాస్ కెమెరాలు, శక్తివంతమైన చిప్‌సెట్స్, భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఫ్లాగ్‌షిప్ మార్కెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. హై-ఎండ్ ఫోన్ల ప్రేమికులకు ఇవి పర్‌ఫెక్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి.

Beta feature