REDMI 15C 5G: షియోమీ (Xiaomi) సంస్థ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘REDMI 15C 5G’ను డిసెంబర్ 3న భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన రెడ్‌మీ 14C 5Gకి కొనసాగింపుగా (Successor) వస్తున్న ఈ ఫోన్ ఆధునిక డిజైన్, మెరుగైన పనితీరు, రోజంతా వచ్చే బ్యాటరీ లైఫ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ఆధారంగా చూస్తే ఇందులో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్, 8GB వరకు ర్యామ్ వేరియంట్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి అధునాతన ఫీచర్లు ఉండనున్నాయి.
Rishabh Pant: సారీ చెప్పిన రిషబ్ పంత్.. ఎందుకో తెలుసా!
కెమెరా, బ్యాటరీ విషయానికి వస్తే.. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, సెకండరీ లెన్స్ ఉండగా.. ముందు భాగంలో నాచ్ లోపల 8MP సెల్ఫీ కెమెరాను అందించనున్నారు. ముఖ్యంగా 6000mAh భారీ బ్యాటరీకి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ జతచేయడం ద్వారా రోజువారీ వినియోగానికి, స్మూత్ మల్టీటాస్కింగ్‌కు ఈ ఫోన్ చక్కగా సరిపోతుంది. లాంచ్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్, షియోమీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మొత్తానికి బడ్జెట్ ధరలో శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ కోరుకునే వారికి REDMI 15C 5G ఒక మంచి ఎంపికగా నిలవనుంది.
Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీ అంటే ఆ మాత్రం ఉంటాది.. ప్రపంచ టాప్ 10 వంటకాలలో స్థానం..!
Make your way into 2026 like a true boss.
Prepare for the arrival of the supreme power, the ultimate evolution, the one true ruler of the segment.
The #REDMI15C 5G. #2026KaBigBoss. Launching on December 3rd.
Unlock the first glimpse: https://t.co/yCGd45cq12 pic.twitter.com/KKGhMqovU5
— Redmi India (@RedmiIndia) November 27, 2025