Realme GT8 Pro: రియల్‌మీ భారత మార్కెట్‌లో ఫ్లాగ్‌షిప్ realme GT 8 Pro ను అధికారికంగా విడుదల చేసింది. డిజైన్, డిస్ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ ఇలా ప్రతి విభాగంలోనూ ఈ ఫోన్ అత్యుత్తమ స్థాయి ఫీచర్లతో మార్కెట్‌లో సత్తా చాటనుంది. ముఖ్యంగా 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తున్న 2K 144Hz హైపర్ గలౌ డిస్ప్లే హైలెట్ కానున్నాయి. మరి ఈ అద్భుత మొబైల్ లో ఏ ఫీచర్లు ఉన్నాయో వివరంగా చూసేద్దామా..
అద్భుతమైన డిస్ప్లే అండ్ డిజైన్:
రియల్‌మీ GT 8 ప్రోలో 6.79 అంగుళాల 2K+ OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 3200Hz ఇన్‌స్టాంట్ టచ్ సాంప్లింగ్ రేట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. డాల్బి విజన్ సపోర్ట్, హార్డ్‌వేర్-లెవల్ DC డిమ్మింగ్ వంటి లక్షణాలు విజువల్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ ఫోన్‌లో తొలి సారిగా స్విట్చబుల్ కెమెరా బంప్ టెక్నాలజీను ప్రవేశపెట్టారు. దీనితో వినియోగదారుడు రౌండ్, స్క్వేర్, రోబోట్ థీమ్ వంటి కెమెరా మాడ్యూల్స్‌ను తన ఇష్టానుసారం మార్చుకోవచ్చు.

అత్యాధునిక ప్రాసెసర్:
పనితీరు పరంగా ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉపయోగించారు. అలాగే ఇందులో 16GB LPDDR5X ర్యామ్, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ లభ్యం అవుతుంది. ఇక ఇంధువైలో ప్రత్యేకంగా 7000mm² VC కూలింగ్ సిస్టమ్ ను చరిత్రలోనే అతిపెద్దదిగా రియల్‌మీ వినియోగించింది. ఇక ‘AI గేమింగ్ సూపర్ ఫ్రేమ్’ టెక్నాలజీతో MLBB ను 144Hz లో, BGMI ను 120Hz లో కూడా 35°C ఉష్ణోగ్రత వద్ద సాఫీగానే రన్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.
కెమెరా విభాగం:
రియల్‌మీ GT 8 ప్రో రికో ఇమేజింగ్ కంపెనీతో కలిసి రూపుదిద్దుకున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. రికో GR సిరీస్ నుండి పొందిన టెక్నాలజీతో ఈ ఫోన్ కెమెరా సెటప్ మరింత శక్తివంతమైంది. ఇందులో 200MP 3x పెరిస్కోప్ టెలిఫోటో (Samsung HP5) 12X లాస్‌లెస్ జూమ్, 120X హైబ్రిడ్ జూమ్ కలిగి ఉంది. అలాగే 50MP ప్రధాన కెమెరా 1/1.56” సెన్సార్, Ricoh GR యాంటీ-గ్లర్ లెన్స్, OIS, 50MP 116° అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. అలాగే వీటిలో 4K 120fps Dolby Vision, 8K 30fps రికార్డింగ్, 4K 120fps 10-bit Log వీడియో రికార్డింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ & ఛార్జింగ్:
ఈ ఫోన్‌లో భారీ సామర్థ్యం గల 7000mAh టైటన్ బ్యాటరీ ను అమర్చారు. ఇందులో 120W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా ఫోన్‌ను 0 నుంచి 100% వరకు కేవలం 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జింగ్ ద్వారా 15 నిమిషాల్లో 50% ఛార్జ్ పొందవచ్చు.
సాఫ్ట్‌వేర్ & ఇతర ఫీచర్లు:
రియల్‌మీ GT 8 ప్రో Android 16 ఆధారిత realme UI 7.0 పై నడుస్తుంది. ఇక కంపెనీ 4 సంవత్సరాల OS అప్డేట్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని వెల్లడించింది. అల్ట్రా హాప్టిక్ మోటార్, సిమ్మెట్రీక్ మాస్టర్ ఎకౌస్టిక్ స్పీకర్, IP66 + IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో లభిస్తాయి.
CM Revanth: సీఎంను కలిసిన Analog AI CEO అలెక్స్ కిప్‌మాన్.. రాష్ట్రాభివృద్ధిపై చర్చలు..!

రియల్‌మీ GT 8 ప్రో డ్రీమ్ ఎడిషన్:
రియల్‌మీ GT 8 ప్రో డ్రీమ్ ఎడిషన్ Aston Martin Aramco F1 టీమ్‌తో కలిసి రూపొందించిన ప్రత్యేక ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా వచ్చింది. ఈ ఎడిషన్‌లో Aston Martin Racing Green అనే ప్రత్యేక రంగుతో పాటు Lime Essence యాక్సెంట్ డిజైన్‌ను అందించడం దీన్ని మరింత ప్రీమియం, విభిన్నంగా నిలబెడుతోంది. అలాగే ప్రత్యేకమైన F1-థీమ్ యూజర్ ఇంటర్‌ఫేస్, AMR25 డైనమిక్ వాల్‌పేపర్, GT Mode ట్రాక్ సౌండ్ వంటి రేసింగ్-ఇన్‌స్పైర్డ్ ఎలిమెంట్లు ఈ ఎడిషన్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి.
ధరలు:
ధరల విషయానికి వస్తే రియల్‌మీ GT 8 ప్రో డ్రీమ్ ఎడిషన్ 16GB+512GB వేరియంట్ ధర రూ.79,999గా నిర్ణయించబడింది. సాధారణ మోడళ్లలో 12GB+256GB వేరియంట్ రూ.72,999 ధరతో, రూ. 5000 బ్యాంక్ ఆఫర్, 6 నెలల EMI, అలాగే ఉచిత డెకో సెట్ తో కలిపి రూ.67,999కు లభిస్తుంది. 16GB+512GB వేరియంట్ రూ.73,999కి లభిస్తుంది. అలాగే ICICI, HDFC, SBI వంటి బ్యాంకులపై ప్రత్యేక ఆఫర్లు అమల్లో ఉన్నాయి. ఆఫ్‌లైన్ మార్కెట్‌లో కూడా HDFC, AXIS, KOTAK, OneCard, DBS, BOB, AU, J&K, Scapia వంటి బ్యాంకులపై EMI ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. SBI, ICICI బ్యాంకులతో పూర్తి మొత్తం స్వైప్ చేసుకునే అవకాశం కూడా ఉంది. రియల్‌మీ GT 8 ప్రో మరియు దాని డ్రీమ్ ఎడిషన్ మోడళ్లు సమీప రిటైల్ స్టోర్లతో పాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.
