3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP69K/69/68/66 డ్యూరబిలిటీ రేటింగ్‌లతో లాంచ్‌కు సిద్ధమైన Honor 500 సిరీస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor 500: Honor సంస్థ కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ Honor 500 ను ఈ నెల 24న చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో Honor 500, Honor 500 Pro మోడళ్లు లాంచ్ కానున్నాయి. ఈ మొబైల్స్ సంబంధించి కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, అధికారికంగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఫోన్‌ల వెనుక భాగం డిజైన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ముఖ్యంగా ఐఫోన్ ఎయిర్-స్టైల్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ బ్యాక్ డిజైన్ స్పష్టంగా వీటిలో కనిపిస్తున్నాయి.
Also Read
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
Honor 500 సిరీస్ ఈసారి భారీ స్పెసిఫికేషన్లతో రానుందని సమాచారం. సాధారణ Honor 500 మోడల్‌లో 6.55 అంగుళాల 1.5K 120Hz LTPS ఫ్లాట్ OLED డిస్‌ప్లే, 3840Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ లభించనుంది. దీనిలో Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌ను, కెమెరా విభాగంలో 200MP HP3 ప్రధాన సెన్సార్ (OISతో), 12MP అల్ట్రావైడ్ మరియు 50MP సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. అలాగే 8000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితోపాటు IP69K/69/68/66 రేటింగ్‌లు, మెటల్ ఫ్రేమ్, Honor యొక్క C1+, E2 చిప్‌లు, MagicOS 10 లాంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
CP Sajjanar: ఐ-బొమ్మలో 21వేల సినిమాలు.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. రూ. కోట్లల్లో సంపాదన..
ఇక Honor 500 Pro మోడల్ విషయానికి వస్తే.. ఇందులో Snapdragon 8 Elite చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారని సమాచారం. ఈ మొబైల్ కూడా 6.55-అంగుళాల 1.5K 120Hz OLED డిస్‌ప్లే ఉన్నా, కెమెరా విభాగంలో మాత్రం అప్‌గ్రేడ్‌లు కనిపిస్తున్నాయి. 200MP HP3 ప్రధాన సెన్సార్ (OISతో), 12MP అల్ట్రావైడ్ లెన్స్‌తో పాటు 50MP IMX856 టెలిఫోటో (3x జూమ్) కూడా ఉండనుంది. ఫ్రంట్ కెమెరా 50MP గానే ఉంటుంది. 8000mAh బ్యాటరీతో పాటు 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. అలాగే IP69K/69/68/66 రేటింగ్‌లు, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మెటల్ ఫ్రేమ్, C1+, E2 చిప్‌లు ఈ మోడల్‌ను మరింత ప్రీమియంగా నిలబెట్టనున్నాయి.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!