భారీ డిస్కౌంట్స్ ధరతో Vivo X300, X300 Pro ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ భారత్ లో లాంచ్.. ధర ఎంతంటే..?
- Vivo X300 మరియు X300 Pro స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్
- రెండు ఫోన్‌లలోనూ Dimensity 9500 ప్రాసెసర్, 1.5K LTPO డిస్‌ప్లే, Wi-Fi 7, 4500 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు
- X300: గరిష్టంగా 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్, 6040mAh బ్యాటరీ.
- X300 Pro: 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్, 6510mAh బ్యాటరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo X300, X300 Pro: వివో సంస్థ నుండి Vivo X300, X300 Pro ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో నేడు విడుదలయ్యాయి. అధునాతన కెమెరా సాంకేతికత, శక్తివంతమైన ప్రాసెసర్, అత్యుత్తమ డిస్‌ప్లే ఫీచర్లతో ఈ ఫోన్‌లు ప్రీమియం సెగ్మెంట్‌లో లాంచ్ అయ్యాయి. Vivo X300లో 6.31 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లే అందించగా.. Vivo X300 Proలో 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను అందించారు. రెండింటిలోనూ Dimensity 9500 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అమర్చబడింది. Vivo X300లో 12GB –16GB ర్యామ్, 256GB –512GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉండగా.. Vivo X300 Proలో 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్‌తో వస్తోంది. బ్యాటరీ పరంగా Vivo X300లో 6040mAh, Vivo X300 Proలో 6510mAh సామర్థ్యం ఉండగా.. రెండింటిలోనూ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌లను అందించారు. ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఉండే Origin OS 6.0పై పనిచేస్తాయి. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్‌లు కూడా ఉన్నాయి. అలాగే వీటిలో Wi-Fi 7, BOE Q10+ డిస్‌ప్లే మెటీరియల్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు రెండు ఫోన్‌లలోనూ అందుబాటులో ఉన్నాయి.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
కెమెరా విభాగం ఈ సిరీస్‌కి ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తుంది. Vivo X300లో 200MP Samsung HPB ప్రధాన సెన్సార్‌ను ఉపయోగించగా, X300 Proలో 50MP Sony LYT828 పెద్ద సైజు సెన్సార్‌ను అమర్చారు. టెలిఫోటో విషయంలో X300లో 50MP పెరిస్కోప్ లెన్స్ 3x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తే, X300 Proలో 200MP పెరిస్కోప్ కెమెరా 3.7x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తున్నది. రెండు ఫోన్‌లలోనూ 50MP అల్ట్రా-వైడ్, 50MP ఫ్రంట్ కెమెరాలు అందించారు. అలాగే, ఈ రెండు మోడళ్లు ZEISS 2.35x టెలికన్వర్టర్ కిట్‌కు మద్దతు ఇస్తాయి. ఇది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని మరింత మెరుగుపరుస్తుందని సంస్థ పేర్కొంది.

ఇక ధరల విషయానికి వస్తే.. Vivo X300 12GB+256GB వేరియంట్ ధర రూ.75,999 కాగా, 12GB+512GB మోడల్ రూ.81,999, 16GB+512GB మోడల్ రూ.85,999గా ఉంది. ఇక X300 Pro 16GB+512GB మోడల్ ధర రూ.1,09,999గా నిర్ణయించారు. ZEISS 2.35x టెలిఫోటో ఎక్స్‌టెండర్ కిట్‌ను విడిగా రూ.18,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లు వివో ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో నేటి నుంచే బుకింగ్‌కి అందుబాటులో ఉంటాయి. అమ్మకాలు డిసెంబర్ 10 నుంచి ప్రారంభమవుతాయి.
ఇక లాంచ్ ఆఫర్లలో SBI, HDFC, IDFC ఫస్ట్ బ్యాంకు, ఎస్ బ్యాంకు కార్డులపై 10% ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, V-Upgrade ద్వారా 10% తగ్గింపు, ఒక సంవత్సరం ఉచిత అదనపు వారంటీ, 60% అష్యూర్డ్ బైబ్యాక్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా ఇందులో 24 నెలల వరకు నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. ఇంకా ZEISS టెలిఫోటో కిట్‌తో కలిసి కొనుగోలు చేస్తే రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్ లేదా 10% వెంటనే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!