ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ తీవ్రంగా తగ్గిపోయింది. జీరో లెవల్‌కు పడిపోయింది. వెంటనే గుర్తించిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు.
Piyush Goyal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దైంది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత అందులో సాంకేతిక లోపం ఉన్నట్లు తేలడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు.
Hyderabad Metro: హైదరాబాద్ నగరంలోని మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ టు ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో ట్రైన్ ఆగిపోయింది. దాదాపుగా 20 నిమిషాల పాటు భరత్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర రైలు నిలిచిపోయింది.
HP: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని ఆత్మకూరులోని HP పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజల్ పంపుల్లో గమనించిన మోసంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజల్ పంపుల నుంచి ఇంధనం రాకపోయినా పరికరంలో చూపించే మీటర్ తిరుగుతూ అమౌంట్ చూపిస్తూ ఉంది. పెట్రోల్, డీజల్ ధరను వాస్తవానికి తగినంత చూపించకుండానే అమౌంట్ చూపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. వాహనదారులు ఈ మోసాన్ని గమనించి పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అయితే, సిబ్బంది దీనిని ఒక “టెక్నికల్ ప్రాబ్లమ్”…
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ లోపాన్ని గమనించి హెలికాప్టర్‌ను సురక్షితంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు చేర్చారు.
యునైటెడ్ కింగ్‌డమ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సాంకేతిక సమస్యతో పోరాడుతోంది. కంపూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఎయిరిండియాకు చెందిన విమానం రష్యాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఆ విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.
మెట్రో రైళ్లు మళ్లీ మొరాయించాయి. సోమవారం ఉదయం ఎల్.బి.నగర్ వెళ్తున్న మెట్రో సాంకేతిక లోపంతో మెట్రో ట్రైన్ ఎర్రమంజైల్ లో అధికారులు ఆపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.