Emergency Landing: తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం..
- శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ -తిరుపతి ఫ్లైట్ అత్యవసర లాండింగ్..
- సాంకేతిక కారణాల కారణంగా తిరిగి అత్యవసర లాండింగ్..
- ప్రయాణికులు సురక్షితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emergency Landing: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 66 మంది ప్రయాణికులతో తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్లైన్స్ విమానం 9I 877 సాంకేతిక కారణంగా తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలోనే అత్యవసర లాండింగ్ అయింది. ఉదయం 6.12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన ఫ్లైట్ తిరిగి 8.17 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులోనే ల్యాండ్ అయింది. శంషాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట సమీపంలో ఉండగా వెంటనే ATC కేంద్రానికి సమాచారం అందించాడు.
అంతేకాకుండా.. పైలెట్ ప్రయాణిలకు అలర్ట్ చేశారు. భయపడాల్సిన అవసరం లేదని ల్యాండింగ్ సిద్దంగా వున్నామని, ప్రయాణికులు సహకరించాలని కోరారు. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పైలట్ సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించారు. దీంతో పైలట్ విమానాన్ని ఒంటిమిట్ట నుంచి తిరిగి శంషాబాద్ లో ల్యాండ్ చేశాడు. విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు. విమానంలో మొత్తం 66 మంది ప్రయాణికులు ఉన్నారని ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం సరి చేసిన వెంటనే తిరుగు ప్రయాణించేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. ప్రయాణికులకు రెస్ట్ రూం ఏర్పాటు చేశామన్నారు.
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
Hyderabad: బైక్ పై అబ్బాయి ఒడిలోనే అమ్మాయి.. హద్దులు దాటి ముద్దులు..
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!