భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కు సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతుంది. సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైన టీమిండియా తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. దీని కోసం టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో, బ్యాట్స్‌మెన్ వారి టెక్నిక్‌ను, బౌలర్లు వారి లైన్-లెంగ్త్‌ను మెరుగుపరచుకోవడంలో బిజీగా ఉన్నారు. ఈ సన్నాహాల మధ్య ఓ ఫన్నీ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ జట్టులోని ఇద్దరు ఆటగాళ్ళు సొంత కోచ్ తో కుస్తీ పడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
READ MORE: India China: భారత్‌ని చుట్టుముట్టేలా చైనా ప్లాన్.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో త్రైపాక్షిక సమావేశం..
ప్రాక్టీస్ సెషన్‌లో ఫాస్ట్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్ టీం ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్‌తో కుస్తీ పడ్డారు. అయితే.. ఇది సీరియస్ ఫైట్ కాదు. వినోదంలో భాగమే. కోచ్, ఆటగాళ్లకు ఉన్న స్నేహ బంధానికి నిదర్శనం. ముగ్గురూ నవ్వుతూ, ఆడుకుంటూ గడుపుతున్నారు. వారి అల్లరిని ఓ వ్యక్తి కెమెరాలో బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, మోర్నే మోర్కెల్ మొదట్లో అర్ష్‌దీప్ సింగ్ మీద పడి డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్ మాదిరిగా ఫైట్ చేస్తాడు. పక్కనే ఉన్న ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి మోర్నే మోర్కెల్‌ను నేలపై పడేలా చేశారు. తరువాత మోర్నే మోర్కెల్ మరోసారి అర్ష్‌దీప్‌ను కింద పడేసి గొడవ పడతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
READ MORE: CM Chandrababu: రేపు టీడీపీ కీలక సమావేశం.. ఇంటింటి ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం..
A fun WWE fight by Morkel & Arshdeep 😂🔥 [Ankan Kar] pic.twitter.com/bYmDPXUR3w
— Johns. (@CricCrazyJohns) June 28, 2025