ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లోని అగ్రశ్రేణి జట్లలో టీమిండియా ఒకటి. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. అటు వన్డే, ఇటు టీ20లలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గానూ నిలిచింది. టెస్టుల్లోనూ అగ్రస్థానంలో కొన్నాళ్ల పాటు కొనసాగింది. అయితే 1983లో టీమిండియా పసికూన . ఆ ఏడాది జరిగి వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా బరిలోకి దిగింది. ఆనాడు టీమిండియాపై ఎలాంటి అంచనాలు లేవు. సెమీస్‌కు వెళ్తే అదే గొప్ప అనే అభిప్రాయంలో క్రికెట్ పండితులు ఉన్నారు. కానీ కపిల్ దేవ్ సేన చరిత్ర సృష్టించింది. 39 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే జూన్ 25న టీమిండియా తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ను సగర్వంగా కైవసం చేసుకుంది. దీంతో క్రికెట్‌లో భారత జట్టు ఆధిపత్యం మొదలైంది. జూన్ 25న క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ గడ్డపై లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బలమైన వెస్టిండీస్ జట్టును ఏకంగా 43 పరుగుల తేడాతో టీమిండియా మట్టి కరిపించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. చేసింది స్వల్ప స్కోరు కావడంతో భారత్ విజయం సాధిస్తుందన్న నమ్మకాలు ఆవిరయ్యాయి. అందులోనూ వెస్టిండీస్ జట్టులో హేమాహేమీలు ఉన్నారు. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రారంభం కాకముందే భారత్ ఓడిపోతుందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ అనూహ్యంగా వెస్టిండీస్ జట్టు 140 పరుగులకే కుప్పకూలింది. వివియన్ రిచర్డ్స్ మాత్రమే 33 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మదన్ లాల్ బౌలింగ్‌లో వివియన్ రిచర్డ్స్ కొట్టిన బంతిని భారత సారథి కపిల్ దేవ్ క్యాచ్ పట్టడం ఇప్పటికీ ఓ చరిత్రే. ఇటీవల విడుదలైన కపిల్ బయోపిక్ ’83’ సినిమాలోనూ ఈ ఘట్టాన్ని చూపించారు. 1983 తర్వాతే భారత్‌లో క్రికెట్ అంటే అందరికీ మక్కువ పెరిగింది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత 2011లో ధోనీ కెప్టెన్సీలో టీమిండియా వన్డే వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. కాగా టీమిండియాకు ఇది అరుదైన రోజు అంటూ బీసీసీఐ కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేసింది.
అటు ప్రపంచ క్రికెట్ చరిత్రలో సరిగ్గా 90 ఏళ్ల క్రితం ఇదేరోజు టీమ్ ఇండియా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆ సమయంలో టెస్టు క్రికెట్ ఆడిన 6వ టీమ్‌గా ఇండియా చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి మొత్తం 562 టెస్టు మ్యాచ్‌లు ఆడగా..168 గెలిచింది. 173 మ్యాచ్‌లు ఓడిపోయింది. 220 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
🗓️ #OnThisDay in 1983
A historic day & a landmark moment for Indian cricket as #TeamIndia, led by @therealkapildev, clinched the World Cup title. 🏆 👏 pic.twitter.com/WlqB0DQp1U
— BCCI (@BCCI) June 25, 2022
Ben Stokes: స్టోక్స్ అరుదైన రికార్డు.. 100 సిక్సర్లు.. 100 వికెట్లు..!!