టీమిండియా 15 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో చివరి 5 ఓవర్లలో భారత్ అత్యధిక పరుగులు చేసింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో చివరి 5 ఓవర్లలో టీమిండియా 86 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్ చూడముచ్చటైన షాట్లతో అలరించి జట్టుకు భారీ స్కోరు అందించారు. కాగా 2007లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 80 పరుగులు, 2019లో బెంగళూరు వేదికగా…
కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా పేస్ బౌలర్ దీపక్ చాహర్ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో కేవలం 1.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అప్పటికే రెండు వికెట్లు కూడా తీశాడు. అతడి రెండో ఓవర్ కోటాను ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ పూర్తి చేశాడు. మళ్లీ దీపక్ చాహర్ బౌలింగ్‌కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి శ్రీలకంతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు దీపక్ చాహర్ అందుబాటులో ఉండడం కష్టమేనని…
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను రిటైర్ కావాలని సూచించాడంటూ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే సాహా వ్యాఖ్యలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. సాహా తనపై చేసిన ఆరోపణలు తనను బాధించలేదని తెలిపాడు. టీమిండియా సాధించిన ఎన్నో విజయాలకు కారణమైన సాహాపై తనకు గౌరవం కూడా ఉందన్నాడు. జట్టు ఎంపికలో తాను, కెప్టెన్ రోహిత్ శర్మ కఠినంగా ఉంటామని.. ఆటగాళ్లను తుది జట్టులో ఎందుకు ఎంపిక చేయడం లేదో కారణాన్ని…
వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20 సిరీస్‌ను టీమిండియా వైట్ వాష్ చేసింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకుల్లోనూ టీమిండియా అదరగొట్టింది. ఈ సిరీస్ విజయంతో 269 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి టీమిండియా అగ్రస్థానానికి చేరింది. దాదాపు ఆరేళ్ల తర్వాత టీమిండియా టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరడం విశేషం. అంతకుముందు 2016 ఫిబ్రవరిలో చివరిసారిగా ధోనీ సారథ్యంలో భారత్ అగ్రస్థానానికి చేరింది. మరోవైపు స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్ విజయం.…
కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ (65), వెంకటేష్ అయ్యర్ (35 నాటౌట్) మంచి స్కోరు అందించారు. దీంతో 20 ఓవర్లలో భారత్ 184/5 స్కోరు చేసింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను 20 ఓవర్లలో 167/9 పరుగులకే టీమిండియా కట్టడి చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసి భారత…
టీమిండియాకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మనే కెప్టెన్. గతంలో రోహిత్ టెస్టుల్లో పనికిరాడని ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలను తట్టుకుని ఏకంగా టెస్టు జట్టుకే నాయకత్వం వహించే స్థాయికి రోహిత్ ఎదిగాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం రోహిత్ శర్మ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2018 సెప్టెంబర్ 1న రోహిత్ అభిమానులతో #AskRohit నిర్వహించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధానమిస్తూ.. ‘నన్ను…
సొంతగడ్డపై త్వరలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు టీమిండియాను ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానెలపై సెలక్టర్లు వేటు వేశారు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు టెస్టు జట్టులో చోటు కల్పించారు. అటు టీ20 సిరీస్‌కు కూడా భారత జట్టును ప్రకటించారు. టీ20 సిరీస్‌కు కోహ్లీ, పంత్‌కు విశ్రాంతి ఇచ్చారు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. కాగా శ్రీలంకతో రెండు టెస్టులు, మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. మార్చి 4 నుంచి తొలి టెస్ట్…
కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ (19) విఫలమైనా… మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. కోహ్లీ (52), కీపర్ రిషబ్ పంత్ (52) రాణించారు. పంత్, వెంకటేష్ అయ్యర్ కలిసి 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోస్టన్ ఛేజ్…
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించడానికి చేరువలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఈరోజు జరిగే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పేరు మీద…
సారథిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి వన్డే సిరీస్‌లోనే రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌లో వన్డేల్లో విండీస్‌ను వైట్‌వాష్ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. తన తొలి వన్డే సిరీస్‌నే క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును అధిగమించాడు. రోహిత్ ఇప్పటివరకు 13 వన్డేలకు కెప్టెన్సీ వహించగా 11 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. దీంతో ఇండియా తరఫున కోహ్లీ నెలకొల్పిన…