CM Chandrababu: సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతిపక్షాలు ఒక్కోసారి అప్పర్ హాండ్ లో ఉంటాయి.. అధికార పక్షానికి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సభ నడిపే విధానంలో ఆచి తూచి వ్యవహరించాలి.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో కూటమి బలం 164.. వైసీపీ ఎమ్మెల్యేలు 11.. అయిన కూడా సీఎం చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలను లైట్ గా తీసుకోవద్దు అంటున్నారు.. ఎమ్మెల్యేలు, మంత్రులు సబ్జెక్టు పై పట్టుతో అసెంబ్లీ సమావేశాలను నడపాలని సూచించారు.
Read Also: Bikes: మార్కెట్లోకి కొత్తగా ఈవీ, సీఎన్‌జీ బైక్స్.. మరి డీజిల్ బైక్స్‌ను ఎందుకు తయారు చేయరు?
అసెంబ్లీ జరిగినపుడు ప్రతిపక్షం సాధారణంగా అడ్డు పడుతూ ఉంటుంది.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు. చర్చలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో.. కానీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రావడం లేదు.. బడ్జెట్ సమావేశాలకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.. అయితే, ఇక్కడే అలెర్ట్ అవుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీకి రాకపోయినా బయట వైసీపీకి మాట్లాడే అవకాశం ఉంది.. దీంతో, వైసీపీ కౌంటర్ లకు వెంటనే రెస్పాండ్ అవ్వాలని చెబుతున్నారు. ప్రస్తుతం.. ప్రభుత్వం ముందు సంక్షేమ పథకాలకు సంబంధించి సవాళ్లు ఉన్నాయి.. ఇప్పటి వరకు 8 నెలలు పూర్తి అయ్యాయి.. ఇప్పుడు కేవలం 2 పథకాలు మాత్రమే. అమలులో ఉన్నాయి.. మరి కొన్ని త్వరలోనే ప్రారంభం అంటున్నారు.. ఇది వైసీపీకి కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంది.. సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ విషయంలో కానీ.. అమరావతి విషయంలో కానీ.. తగిన సమాధానం చెప్పాలంటున్నారు… అయితే, వైసీపీ చేసే విమర్శలకు వెంటనే కౌంటర్ ఉండలంటున్నారు. ప్రభుత్వం 8 నెలల పాలనా తీరు.. తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షం అడగకపోయినా కూడా. చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని ఎమ్మెల్యేలు, మంత్రులకు చెబుతున్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Russia-Ukraine war: మొదలైన శాంతి చర్చలు.. ఉక్రెయిన్ లేకుండానే చర్చలు
మంత్రులు.. ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నారు సీఎం చంద్రబాబు.. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలపై దృష్టి పెట్టేవిధంగా త్వరలో కార్యాచరణ సిద్ధం అవుతోంది.. జనసేన శాసన సభ పక్ష సమావేశం కూడా త్వరలో జరుగుతోంది.. ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు ఇవ్వనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇప్పటికే పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు ప్రభుత్వ పని తీరుపై కొన్ని చురకలు వేస్తుంటారు… ఒక వైపు సీఎం చంద్రబాబు మరో వైపు పవన్ కల్యాణ్.. బీజేపీతో కలిసి అధికార ప్రతిపక్ష పాత్రలు తామే పోషించడానికి రెడీ అవుతున్నారు..