గంజాయి సాగు 11 వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు వచ్చిందని, ఇంకా పూర్తి స్థాయిలో అరికడతాం అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ గంజాయి అరికట్టడంపై దృష్టి పెట్టిందన్నారు. స్కూల్స్, కాలేజీ పిల్లలు గంజాయికి బానిసలు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని, జిల్లాల వారీగా వర్క్ షాప్స్ జరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాలలో గంజాయి సాగు అరికట్టడంపై హోంమంత్రి మాట్లాడారు.
‘గంజాయి అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ గంజాయి అరికట్టడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో గంజాయి రూపం మార్చుకుంది. డ్రై లిక్విడ్ రూపంలో గంజాయి వస్తోంది. స్కూల్స్, కాలేజీ పిల్లలు గంజాయికి బానిసలు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాల వారీగా వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. గంజాయి సాగు 11 వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో అరికడతాం. మహిళలకు గంజాయి అలవాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు.