చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నా చుట్టూ తిరగకండి.. ప్రదక్షిణలు చేస్తే పదవులు రావు అంటూ కార్యకర్తలకు సూచించారు. పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అంటే మీరు ప్రజలతో ఉండాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా…
Minister Narayana: నెల్లూరులో వివిద శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించారు.. అందులో నేను కూడా బాధితుడినే అన్నారు. కానీ, ఇప్పుడు తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది చెప్పారు.
Margani Bharat: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు మ్యాటర్ ఎక్కువ.. మీటర్ తక్కువ అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలకు అనుగుణంగా బడ్జెట్ ఎందుకు రూపొందించలేకపోయారు అని ప్రశ్నించారు.
Gudivada Amarnath: ఎన్నికల ముందు హలో ఏపీ.. బైబై వైసీపీ అని విస్తృత ప్రచారం చేసిన కూటమి పార్టీలు వంచన చూసిన తర్వాత హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ అని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
Home Minister Anitha: అనంతపురంలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. మా కూటమిలో ఎలాంటి అంతరుద్ద్యం లేదు.. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలి అని చురకలు అంటించింది.
Asha workers: ఆశా వర్కర్ల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరుతో పాటు గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంపుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
అక్కడ నాయకులంతా మనం మనం బరంపురం అంటున్నారా? పార్టీ ఏదైతేనేం…. రాష్ట్ర స్థాయిలో వాళ్లు ఎలా కొట్టుకుంటే మనకెందుకు? జిల్లాలో మాత్రం కలిసుందామని అనుకుంటున్నారా? ఆగర్భ శతృవుల్లా వ్యవహరించే టీడీపీ, వైసీపీ నాయకులు సైతం ఇక్కడ అంత సీన్ లేదమ్మా అంటున్నారా? ఏ వివాదం తలెత్తినా టీ కప్పులో తుఫాన్లా రెండు రోజుల్లో చల్లారిపోతున్న ఆ జిల్లా ఏది? ఏంటి అక్కడి డిఫరెంట్ రాజకీయం? ఉమ్మడి కర్నూలు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మహామహుల్ని…
Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి అని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. అందరినీ మోసం చేసినట్లే రైతులను కూడా దగా చేసిన బడ్జెట్ ఇది.. బాబు షూరిటీ.. నో గ్యారంటీ అని ఎద్దేవా చేశారు.
RK Roja: ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించింది. జనాన్ని నమ్మించి నట్టేట ముంచింది కూటమి ప్రభుత్వం.. చంద్రబాబును పొగడ్తలతో ముంచేత్తడానికే, భజన చేయడానికే పయ్యావుల కేశవ్ సమయం అంతా వృథా చేశారంటూ ఎద్దేవా చేసింది. రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదు..
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మార్చ్ 1వ తేదీన) చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.