కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారని, సంక్షేమం పట్టించుకోవడం లేదని, అభివృధి ఎక్కడా కనిపించడం లేదని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, రెండున్నర లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్ రెడ్డికి 40 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ప్రతీకార కక్ష్యతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించలేకపోతున్నా అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని భూమన ఫైర్ అయ్యారు.
‘ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. రెండున్నర లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్ రెడ్డికి 40శాతం ఓట్లు వచ్చాయి. మిమ్మల్ని మోస్తున్న ఛానెల్స్, పత్రికలు దుర్మార్గపు ప్రచారానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడిపోయారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు కోతలు పెట్టారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసే లేదు. 95 శాతం హామీలు గాలికి వదిలేశారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారు.. సంక్షేమం పట్టించుకోవడం లేదు, అభివృధి ఎక్కడ కనిపించడం లేదు. మీరు ప్రజల్లోకి వెళ్తే పేదల కష్టాలు తెలుస్తాయి. పచ్చి అబద్ధాలతో ఎల్లకాలం సాగదు చంద్రబాబు. వైసీపీ పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తం అవుతుంది. సోషల్ మీడియాలో వైసీపీ బలంగా ఉంది అంటూ పచ్చ మీడియా రాస్తున్నారు. వాస్తవానికి మీ ప్రభుత్వం పట్ల టీడీపీ సానుభూతి పరులుల్లో వ్యతిరేకత ఉంది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాల్సి ఉంది, ఎన్నాళ్లీ మోసం. అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించలేకపోతున్నా అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. మోసపు అబద్ధాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారు’ అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
‘వైసీపీ నాయకులు, సోషల్ మీడియాపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడవచ్చు కానీ.. ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. 51 శాతం మంది ప్రజలు వైసీపీ వైపు ఉన్నారు. జగన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు. పోసానిపై రాజకీయ ఉద్దేశ్య పూర్వకంగానే పెట్టిన కేసులు అని కోర్టులో పొన్నావోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ప్రతీకార కక్ష్యతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. పచ్చ పత్రికలు సిగ్గు పడాలి, పోసాని ఆరోగ్యం పరిస్థితిపై నాటకాలు అంటూ విషప్రచారం చేస్తున్నారు. రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నా ఆయనకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. పోసానిపై ఎల్లో మీడియా ఎందుకు విష రాతలు రాస్తోంది. పోసానికి వచ్చిన పరిస్థితి మీకు ఎదురైతే ఇలానే ఆలోచిస్తారా?’ అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.