CM Chandrababu: తెలుగుదేశం పార్టీ.. తెలుగింటి ఆడపడుచుల పార్టీ!
- అసెంబ్లీలో మహిళా సాధికారత అంశం
- మహిళలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలు
- ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్
- రిజర్వేషన్స్ అమలైతే 70-75 మంది మహిళా ఎమ్మెల్యేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా.. మహిళలను దృష్టిలో పెట్టుకునే చేశామన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్ అని తెలిపారు. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా పనిచేశారని మండిపడ్డారు. రిజర్వేషన్స్ అమలైతే 70-75 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారన్నారు. అమెరికా లాంటి దేశాలలో కూడా మహిళలకు సమానత్వం లేదని, సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. మహిళా సాధికారత అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు.
‘మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది. సంక్షేమం, అభివృద్ధి.. ఏదైనా మహిళలను దృష్టిలో పెట్టుకుని చేస్తాము. మహిళా సాధికారతపై మాటలు చెప్పడం వేరు.. చేతలు వేరు. మహిళలకు సమాన హక్కులు కల్పించడం అందరి బాధ్యత. ఇప్పటికీ మహిళలు వివక్షకు గురి అవుతున్నారు. మహిళలను చూస్తే ఇప్పటికీ చిన్నచూపు ఉంది. మహిళలు ప్రతి స్టేజ్లో ఎవరో ఒకరిపై ఆధారపడి ఉండే పరిస్థితి. మహిళా సాధికారత టీడీపీ నుంచి మొదలు అయింది. తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ. మహిళలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా పనిచేశారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
‘విద్యలో మహిళలను ప్రోత్సహించాలి. మహిళలకు ఇచ్చిన 33 శాతం రిజర్వేషన్‌తో సెలెక్ట్ అయిన అధికారిణి సూర్యకుమారి. ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్రపతి ముర్ము, కేంద్ర మంత్రి నిర్మల సీతరామన్ మహిళలకు ఆదర్శంగా ఉన్నారు. రిజర్వేషన్స్ అమలైతే 70-75 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారు. మగవారి కంటే ఆడవారు చాలా తెలివైన వారు. ఇప్పుడు మహిళలకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. అమెరికా లాంటి దేశాలలో కూడా మహిళలకు సమానత్వం లేదు. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో బాలికలకు సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహించాము. దీపం 2 కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఆర్టీసీలో పురుష కండక్టర్ల కంటే.. మహిళా కండక్టర్లే బాగా పనిచేస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!