అధికార పార్టీలో ఉంటే చాలు అడ్డగోలు వ్యాపారాలకు లైసెన్స్ వచ్చేసినట్టేనా? ఐదేళ్లు వైసీపీలో ఉండి నానా బీభత్సం చేసిన చేసిన అక్కడి ఊరసవెల్లులు ఇప్పుడు టీడీపీలోకి ఎంటరైపోయి…. పార్టీ ఏదైతేనేం… మనకు మన యాపారం ముఖ్యం అంటున్నారా? పాత, కొత్త టీడీపీ నేతలు కలిసి మెలిసి పంచేసుకుంటున్నారా? ఎక్కడ జరుగుతోందీ దో నంబర్ దందా? ఎవరా రాజకీయ ముసుగు కప్పుకున్న రాబందులు? ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఇసుక, మద్యం దందాలు యమా…
Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. సహకార డైరీలను మూత వేయాలని టీడీపీ ప్రభుత్వం చూస్తుంది.. అలాగే, చిత్తూరు డైరీ మూత పడటానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు.
సంఖ్య బలం మండలిలో ఉందని వైసీపీ సభ్యులు వస్తున్నారు.. మండలిలో వారు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మేము ఎండకడుతున్నాం.. అలాగే, సీనియర్ నాయకులు అయిన సోము వీర్రాజు మాతో పాటు గళం విప్పుతారు.. ఇక, స్వర్ణంధ్ర ప్రదేశ్ ని తీర్చిదిద్దెందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని మంత్రి సత్య కుమార్ చెప్పుకొచ్చారు.
Somireddy: ఎన్డీయే కూటమి అభ్యర్థులుగా బీదా రవి చంద్ర, కావాలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
Sajjala Ramakrishna Reddy: ఈ నెల 12న చేపట్టిన 'యువత పోరు' ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
Minister Atchannaidu: కేంద్ర ప్రభుత్వంతో కలిసి రైతులకు పెట్టుబడి సాయం కింద 20 వేల రూపాయలను అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాం.. బలహీనవర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటాం అన్నారు లోకేష్.. ఇక, యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికపై టీడీపీ కసరత్తు కొనసాగిస్తోంది. మరోవైపు ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. కొంతమందికి ప్రత్యేకంగా ఫోన్ చేసి పరిస్థితి వివరించినట్టు సమాచారం. ఖరారైన అభ్యర్థుల వివరాలు సాయంత్రం లోగా రానున్నాయి. నామినేషన్ కు రెడీ గా ఉండాలని పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు తీవ్ర ఉత్కంఠ రేకిత్తిస్తోంది.
Sajjala Ramakrishna Reddy: తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు అని మండిపడ్డారు.
Chelluboyina Venu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ. 14 లక్షలు కోట్ల అప్పులపాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. శాసన సభలో 6 లక్షల 40వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది.