Katrenikona MPP Election: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన ఎంపీపీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎంపీటీసీలు సామాజిక వర్గాలుగా విడిపోయారు.
Kadapa ZP Chairman: నేడు ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు చైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు అనంతరం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు చైర్మన్ ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ రోజు (మార్చ్ 27) ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరానికి వెళ్తున్నారు.
ఉమ్మడి కడప జిల్లా.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వివాదం ఇప్పుడు హైకోర్టు వరకు చేరింది.. జడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ గోపవరం జడ్పీటీసీ జయరాం రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు.
రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ , రెండు వైస్ సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి రూరల్ (మం) ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. చంద్రగిరి (మం) రామిరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్ ఉమ, యర్రావారిపాళెం, చింతకుంట ఉప సర్పంచ్ రమేష్ నాయుడు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. READ MORE: CM Chandrababu: ఇవాళ రెండో రోజు కలెక్టర్ల…
కడప మేయర్ సురేష్బాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మాధవి.. అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ సురేష్ బాబు పై చర్యలు తప్పవని హెచ్చరించారు.. అధికారం ఉందని అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. మేయర్ అవినీతి అక్రమాలు చేశారని ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో స్కీములు లేవని.. అన్నీ స్కాములు మాత్రమే ఉన్నాయని అన్నారు. అమరావతి నుంచి హంద్రినీవా దాకా అంతా అవినీతే తాండవిస్తోందని తెలిపారు. కాంట్రాక్టు సంస్థలు రింగ్ అవుతున్నాయి, దీనివల్ల సమయం, ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ప్రశ్నిస్తామని చెప్పిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదంటు మండిపడ్డారు. దేశంలోనే అత్యుత్తమ కాంట్రాక్టు విధానాన్ని జగన్ తీసుకొచ్చారు. జ్యూడిషియల్ ప్రివ్యూతో పాటు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు…
అరకు కాఫీకి ఎంత విశిష్టత ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మరింత ఖ్యాతి గడించబోతుంది. సోమవారం లోక్సభ క్యాంటీన్లో అరకు స్టాల్ ప్రారంభం అయింది. వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ స్టాల్ను ప్రారంభించారు.
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యవహార శైలి రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదట. సొంత జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రతిపక్ష పాత్రను బలంగా పోషిస్తున్నారాయన. కానీ... తీరా శాసనమండలికి వెళ్ళాక అధికార కూటమికి కాస్త దగ్గరగా జరుగుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో త్రిమూర్తులు ఏ వైపు ఉన్నారు?
వైనాట్ పులివెందుల. అసెంబ్లీ ఎన్నికల టైంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నినాదం ఇది. సరే… ఎన్నికలైపోయాయి. కూటమి కనీవినీ ఎరుగని విజయం సాధించింది. అయినా సరే…. పార్టీ పెద్దల మనసు నుంచి వైనాట్ పులివెందుల అన్న మాట చెరిగిపోలేదా? జగన్ అడ్డాలో ఎట్టి పరిస్థితుల్లో బలప్రదర్శన చేయాల్సిందేనని డిసైడయ్యారా? ఈసారి మహానాడును పులివెందులలో నిర్వహించాలన్న ఆలోచన ఉందా? ఆ విషయమై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? కడప పాలిటిక్స్ అనగానే వైఎస్ కుటుంబం గుర్తుకు రావడం…