విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై వైసీపీకి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రీడలను రాజకీయాలను ముడి పెట్టొద్దన్నారు. స్టేడియానికి 30 ఏళ్లుగా ఉన్న పేరే ఉంది.. మేం ఏ పేరు మార్చలేదని స్పష్టం చేశారు. రాజకీయం చేయటం కోసమే వైసీపీ ఇదంతా చేస్తోందని విమర్శించారు. ఎందుకు వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియాలన్నారు. విశాఖ ప్రతిష్ఠ పెంచేలా కూటమి ప్రభుత్వం కష్టపడి మ్యాచ్ లు తీసుకు వచ్చింది. వైసీపీ నేతలు విశాఖ బ్రాండ్ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. స్టేడియం పేరు విషయంలో వైసీపీ రాజకీయం చేస్తోందని తెలిసే విశాఖ వాసులు వారితో ఉండటం లేదన్నారు.
Also Read:Trump: ట్రంప్ మాస్ వార్నింగ్.. టెస్లా ఆస్తులపై దాడి చేస్తే 20 ఏళ్లు జైలు
మేం స్టేడియం దగ్గర రాజకీయాలు మాట్లాడం. విశాఖ మాత్రమే కాదు కడప పులివెందులలో కూడా త్వరలో మ్యాచ్ లు ఆడిస్తాం. ఈ నెల 24, 30 తేదీల్లో జరిగే మ్యాచ్ లకు మంచి స్పందన వస్తుందన్నారు. చంద్రబాబు, లోకేష్ కారణంగా నేను ఎసిఎ అధ్యక్షుడు అయ్యానని తెలిపారు. విశాఖ స్టేడియంలో మౌలిక వసతులు లేవని చెప్పారు. వాటిని ఆధునీకరించాలని మాకు సూచించారు. జనవరి 20 నుంచి మార్చి ఒకటి నాటికి స్టేడియం అభివృద్ధి చేశాం. 34 గదులను అభివృద్ధి చేసి, 320 టాయిలెట్ లను ఆధునీకరించాం. వెంకటపతిరాజు వంటివారు డ్రెస్సింగ్ రూమ్ చూసి మన పని తీరు మెచ్చుకున్నారు.
Also Read:Kesineni Chinni:ఏపీకి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా కూటమి కృషి
రెండు మ్యాచ్ లు అయ్యాక ఎలివేషన్ పనులు పూర్తి చేస్తాం. ప్రేక్షకులకు వినోదం పంచేలా స్టేడియం ఉంది. అన్నీ ఫ్లడ్ లైట్ లతో రెండు నెలల్లో అభివృద్ధి చేయడం గొప్ప విషయం.. ఇందులో కష్టపడిన వారందరికీ నా ధన్యవాదాలు. అమరావతిని కూడా స్పోర్ట్స్ హబ్ గా అభివృద్ధి చేస్తాం. విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీని పెడుతున్నాం. ప్రతి యేడాది ముప్పై. గ్రౌండ్లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. అమరావతి స్టేడియానికి జైస్వాల్ అనుమతి ఇచ్చారు. బిసిసిఐ కూడా ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సహకారం అందిస్తుందని కేశినేని చిన్ని తెలిపారు.