CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే, ఇవాళ ఉదయం 11 గంటలకు16వ ఆర్ధిక సంఘంతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి కేంద్ర సాయంపై ఆర్ధిక సంఘానికి సీఎం వివరించనున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు ఇవాళ రాత్రికి విజయవాడలో విందు ఇవ్వనున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు.
Read Also: India Justice Report : ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025.. తెలంగాణ పోలీస్ విభాగానికి దేశంలో అగ్రస్థానం
ఇక, ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు బయల్దేరతారు. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు పుట్టిన రోజు కావడంతో అక్కడే ఫ్యామిలితో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. తిరిగి ఈ నెల 22వ తేదీన హస్తినకు చేరుకోనున్నారు. ఇక, 23వ తేదీన పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది.