చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు, రక్షణలేదు, సంక్షేమ పథకాలు కూడా లేవని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా… వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె… వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు భద్రత కల్పించారు, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు.. కానీ, చంద్రబాబు వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. ఆయనకు చిన్నమెదడు చితికిపోయిందా..? అని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.. మరోవైపు.. ప్రతీ అంశంలో…
టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ అనే పొట్టేలును ఏపుగా మేపి రాష్ట్రం మీదకు చంద్రబాబు వదిలాడని చురకలు అంటించారు. ప్రజలు..చూసి, చూసి ఏదో ఒక రోజు ఆ పొట్టేలు కొమ్ములు వంచుతారని ఎద్దేవా చేశారు. “లోకేశ్ అనే పొట్టేలుని ఏపుగా మేపి రాష్ట్రం మీదకు వదిలాడు బాబు. కొమ్ముల దురదతో దారిన పోయే వారందరిని కుమ్మాలని చూస్తున్నాడు. చూసి చూసి ఎన్నడో కొమ్ములు…
కాకని గోవర్ధన్ రెడ్డిపై టిడిపి నేత సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. కాకని గోవర్ధన్ రెడ్డి చెప్తున్న మాటలు అన్ని అవాస్తవమని.. ఆనందయ్య పర్మిషన్ లేకుండా ఆన్లైన్ లో మందు పంపిణీ పెట్టారు..అది ప్రశ్నిస్తే తప్ప ? అని నిలదీశారు. గోవర్ధన్ రెడ్డి బాష..దారుణంగా ఉందని..హద్దులేకుండా మాట్లాడటం సబబు కాదని చురకలు అంటించారు. రాజకీయంగా అనవసరంగా మందు పంపిణీ ఆపారని..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పినా మందు పంపిణీ ఆపారని మండిపడ్డారు. తెలుగుదేశం మందు పంపిణీకి పూర్తి మద్దతు ఇస్తుందని..మా కుటుంబాలను…
పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎట్టకేలకు స్పందించారు. జూన్ 1న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ చేసి సీఎం కేసీఆర్ మిమ్మల్ని గుర్తు చేసారని చెప్పారని ఎల్ రమణ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిసి…రాజకీయ భవిష్యత్ గురించి ఏం ఆలోచన చేస్తున్నారని అడిగారని కూడా ఆయన తెలిపారు. గతంలో కూడా టిఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింది…ఇది కొత్త ఏం కాదని వెల్లడించారు. పార్టీ…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబుది ఎప్పుడూ దొంగ చూపే అని చురకలు అంటించారు. “బాబు మాయలో పడి పోతురాజులా కొరడాతో వాతలు తేలేలా కొట్టుకునే వారికి కొంచెం ఆలస్యంగా అర్థమవుతుంది. ఎవరో ఉసిగొల్పితే పిచ్చి చేష్టలు చేసి ఒళ్లు హూనం చేసుకున్నామని పశ్చాతాప పడతారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోతుంది. ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకోవాలని సిఎం జగన్ గారు ముందుచూపుతో వ్యవహరిస్తుంటారు. 40 ఇయర్స్…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టిడిపి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల ఫైర్ అయ్యారు. కరోనా కట్టడి విషయంలో, వైసిపి ప్రభుత్వం విఫలమైందని.. కరోనా వస్తే పారాసేటమాల్, బ్లీచింగ్ సరిపోతుందని జగన్ చెప్పారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే ఏపీ ప్రమాదంలో పడిందని..అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా కట్టడిలో తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా హాస్పిటల్స్ కు వెళ్లి పేషంట్లకు ధైర్యం చెబుతున్నారని తెలిపారు. మన ముఖ్యమంత్రి నాలుగు గోడల నుండి బయటకు రావడంలేదని..ఒక ప్రజా ప్రతినిధిగా ప్రాణాలు…
మందు పంపిణీపై ఎట్టకేలకు ఆనందయ్య స్పందించారు. కొంత ఇబ్బంది ఉన్న మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని..మొదట నియోజకవర్గంలో ఇచ్చి తర్వాత ఇతర ప్రాంతాలకు ఇద్దామని ఎమ్మెల్యేతో తానే చెప్పానని పేర్కొన్నారు. పంపిణీపై సోమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని..సోమిరెడ్డి మాట్లాడింది అవాస్తవమని విమర్శలు చేశారు. మీ సొంత గొడవలోకి తనను లాగవద్దన్నారు. తనను ప్రజాసేవ కోసం ఉపయోగించుకోవాలని..రాజకీయాల్లోకి లాగొద్దని మండిపడ్డారు. సోమవారం నుంచి ముందు పంపిణీ జరుగుతుందని… ఏవైనా పెద్ద ఆటంకాలు వస్తే తప్ప.. పంపిణీ…