ఇప్పటి అవినీతికి కోర్టులు కూడా చాలవు.. చంద్రబాబు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు చేస్తున్న అవినీతికి కోర్టులు కూడా చాలవు అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గుంటూరు జిల్లా చింతలపూడి వెళ్లిన ఆయన.. సంగం డెయిరీ కేసులో అరెస్టై.. జైలుకి వెళ్లొచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించారు.. పార్టీ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత.. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నరేంద్రది.. ఆయన తండ్రి నుండి ఇక్కడి ప్రజలకు, సంగండైరీ రైతాంగానికి అండగా ఉంటున్నారని.. వరుసగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ సేవలు అందించారని.. కానీ, ఇలాంటి పరిస్థితి నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.. విలువలు లేని, కక్షా రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు అని హెచ్చరించిన ఆయన.. రాజకీయ కక్షతో ఏ తప్పు చేయకుండా ముందస్తు నోటీసులు లేకుండా నరేంద్రాని అరెస్ట్ చేశారని ఆరోపించారు… చట్టాన్ని ఉల్లంఘించి పని చేసే వారు భౌవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
అందరూ వైసీపీ నేతల్లాగా తప్పుడు మనుషులు లేరు అని వ్యాఖ్యానించారు చంద్రబాబు.. ప్రభుత్వంలో 43 వేల కోట్ల రూపాయల అవినీతి చేశారన్న ఆయన.. ఇప్పుడు చేస్తున్న అవినీతికి కోర్టులు కూడా చాలవు అన్నారు.. నరేంద్ర ఆస్తులు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు గడిచిన పదేళ్లలో ఎంత పెరిగాయో ప్రజలు చూడాలన్నారు.. ధర్మం కోసం ప్రజా వ్యతిరేక విధానాలపై నరేంద్ర పోరాటం చేస్తున్నారని.. నరేంద్రను బెదిరిస్తూ వచ్చారు.. చివరికి అరెస్ట్ చేశారు అని విమర్శించారు.. ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన చంద్రబాబు.. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్ట చెప్పినా వీళ్లు అరెస్ట్ చేస్తున్నారని.. ఉన్మాది పాలలో పోలీసులు కూడా అలాగే తయారయ్యారని మండిపడ్డారు.. రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి… ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారో.. అలాంటి వారిని వదిలిపెట్టబోమన్న ఆయన.. రాయలసీమలో గతంలో ఉన్నా హత్యా రాజకీయాలు, ముట్టా కక్షలకు తాము చరమగీతం పాడాం… కానీ, మళ్లీ ఈ ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. గతంలో మేం ఇదే విధంగా చేస్తే మీరు ఈ రోజు అధికారంలో ఉండేవారా…? అని ప్రశ్నించారు చంద్రబాబు.
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!