అధికార వైసీపీ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ .. జగన్పై విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు జగన్ చేసిన పనులు తప్పు అయినందునే చట్టాలు చెల్లవని హైకోర్టులో వీగిపోయే పరిస్థితి ఉన్నందునే కొత్త డ్రామాలకు జగన్ తెర లేపారన్నారు. అందుకే అసెంబ్లీ లో మూడు రాజధానుల చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సరికాదని…
ఏపీలో ఇటీవల నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కొన్ని స్థానాల్లో వైసీపీ దూసుకుపోగా, మరొకొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటారు. అయితే తాజాగా కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండపల్లి మున్సిపాలటీలో 29 స్థానాలు ఉండగా అందులో 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలువగా, మరో 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీరితో…
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు ఉద్యమిస్తున్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో 22 రోజులుగా చేస్తున్న మహా పాదయాత్రకు ఆయన మద్దతు ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తిరుపతిలో పర్యటించిన తర్వాత రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకుంది. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు షా హితబోధ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఏపీ…
ఈ నెల 18న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభలో తనను వ్యక్తిగతంగా దూషించారని చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలోనే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతరం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 9 గంటలకు మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.ఇవాళ్టి నుంచి ప్రశ్నోత్తరాల సమయాన్ని అసెంబ్లీ చేపట్టనుంది. సభ ముందుకు ఏపీ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్…
గంభీరంగా ఉండే చంద్రబాబు అంతలా వెక్కి వెక్కి ఏడ్వడానికి కారణమేంటి? తాను వేసే ప్రతి అడుగునూ కార్యకర్తలు గమనిస్తారని తెలిసినా.. ఆ స్థాయిలో విలపించడం వెనకున్న రీజనేంటి..? గట్టిగా పోరాడాలని కార్యకర్తలకు నూరిపోసే చంద్రబాబు ఎందుకు డీలా పడ్డారు..? టీడీఎల్పీ భేటీలో.. మీడియా ఎదుట భావోద్వేగాలను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయారనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీఎల్పీలో ఓ ఫోన్ వచ్చాక బాబు కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయా? ఏపీ అసెంబ్లీలో అనూహ్య పరిణామాల తర్వాత ఎన్నడూ లేని…
ఏపీ అసెంబ్లీ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, నందమూరి అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లో జరిగింది నాటకంతో కూడినటువంటి వ్యవహారమని, అసెంబ్లీలో జరిగింది వేరు బయట జరుగుతున్న ప్రచారం వేరని ఆయన అన్నారు. భువనేశ్వరిని ఎవరు ఏమి అనలేదని, చంద్రబాబు ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు తన సతీమణిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని, హెరాయిన్ కేసు లో నా…
ఏపీలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ ప్రళయంలోనూ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబు కంటతడితో.. ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణల ఎపిసోడ్లో.. టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరోవైపు రంగంలోకి దిగిన నందమూరి, నారా కుటుంబ సభ్యులు.. వైసీపీ నేతల వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. రాజకీయాలతో సంబంధం లేని మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తన కుటుంబాన్ని…
మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఘటనతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. తనను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషించారని, ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడతా అంటూ చంద్రబాబు శపథం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను రెండున్నర ఏళ్లుగా అనేక రకాలు దూషించారని కానీ ఈ రోజు నా సతీమణిని కూడా దూషించారంటూ మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై యావత్తు టీడీపీ, నందమూర అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నందమూరి కుటుంబ…
ప్రజాస్వామ్యంలో చట్ట సభలే దేవాలయాలు. ఒకప్పుడు వాటి పట్ల ప్రజలకు ఎంతో గౌరవం. కాని నేడు చట్ట సభల సమావేశాల తీరు మారింది. ప్రతిష్ట మసకబారింది. గౌరవ సభలు కాస్తా కౌరవ సభలు అవుతున్నాయి. చట్టసభల్లో మటలు హద్దులు హద్దులు దాటుతున్నాయి. హూందాగా సాగాల్సిన సమావేశాలు జుగుప్సాకర స్థాయికి దిగజారాయి. రాజకీయాలతో సంబంధం లేని వారిని, కుటుంబ సభ్యులను ఈ రొచ్చులోకి లాగి సమావేశాలంటేనే వెగటుపుట్టేలా చేస్తున్నారు. వారు వీరు అని లేదు. ఎవరు అధికారంలో ఉన్నా…