మరోసారి భగ్గుమన్న ఏపీ రాజకీయం.. చంద్రబాబును ‘చిల్లర నాయుడు’ అన్న కొడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. నేటి ఉదయం మీడియా ముందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే ఆయన మాటలపై స్పందించిన మంత్రి కొడాలి నాని.. శవాల మీద చిల్లర ఏరుకునే చిల్లర నాయుడు రాష్ట్రంలో ఉండటం దురదృష్టం మంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ జిల్లాల్లో జరిగిన నష్టం అందరికీ తెలుసు… సీఎం వెంటనే స్పందించి అన్నీ చేస్తున్నారని ఆయన అన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నారు… పునరుద్ధరణకు అధికారులు, మంత్రులతో సమీక్షిస్తున్నారన్నారు.
చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎదో అన్నారని కుంటి సాకులు చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఆయన భార్య పేరు తెస్తే ఆ కుటుంబం మద్దతు ఇస్తుందని చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. ఆయన, ఎల్లో మీడియా ఆమెను అల్లరి అల్లరి చేస్తున్నారని, ఎక్కడ కూడా ఆమెను అసెంబ్లీలో కానీ, బయట కానీ మేము చెప్పలేదన్నారు. ఇలాంటి భర్త, కొడుకు దొరకడం ఆమె దురదృష్టమన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏడుపు ముఖం పెడతాడు. అక్కడ వరదల్లో కష్టపడుతుంటే వాళ్ళ దగ్గరకు వెళ్లి నీ సొల్లు పురాణం ఎందుకు.
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అక్కడ పరిష్కారం కానివి ఎమున్నాయో మాకు చెప్పు… వాటన్నిటినీ వదిలేసి నా భార్యను అవమానించారు అని చెప్తాడు. జగన్ ను ఇబ్బంది పెట్టి సోనియా నుంచి నీ కొడుకు వరకు సర్వ నాశనం అయ్యారు. జగన్ పై కేసులు వేసిన వారు ఏమయ్యారో మనం చూశాం. జగన్ ను వేధించిన వాళ్ళకి చంద్రబాబు లాంటి నీచమైన గతి పడుతుంది. వైఎస్సార్ మరణం చాలా గొప్ప మరణం… నీది నీ కొడుకుది కుక్క బతుకు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఈ రోజుకీ వైఎస్సార్ ప్రజల గుండెల్లో బతికున్నారు. నువ్వు జగన్ తో పోరాటం చేయలేక పిచ్చి వాగుడు వాగుతున్నావు. నువ్వు బతికున్నా సచినట్లే లెక్క… పాపి చిరాయువు.. ఒక్కో సీఎం విధానం ఒక్కోలా ఉంటుంది… అన్నీ సహాయక చర్యలు పూర్తయినాక చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి… ఏది పబ్లిసిటీ చేసుకోవాలో కూడా తెలియదు. మేమేమి పుష్కరాల్లో గేట్లు మూసేసి షూటింగ్ పెట్టలేదు.. అక్కడ జరిగిన సంఘటనకు ఈయన్ని ఏమి చేయాలి. ఒక్క సారి స్థాయికి మించి వరద వస్తే ఎవరు ఆపగలరు…? అంటూ కొడాలి నాని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?