అమరావతి : ఏపీ జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వరదల పై శద్ర పెట్టకుండా బురద రాజకీయాలు చేస్తూ ఎదుటివారిపై బురద చల్లే ప్రయత్నం సిగ్గుచేటు అని మండిపడ్డారు. జగనుకి కుప్పంలో దొంగ ఓట్లు వేయించటంపై ఉన్న శ్రద్ద వరద బాధితులను ఆదుకోవటంలో లేదని… జగన్.. ఇకనైనా బురద రాజకీయాలు ఆపి వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకుతక్షణమే ఆర్దిక సాయం అందించాలని…
ఏపీలో రాజకీయాల రోజురోజుకు మారుతున్నాయి. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ నేతలు వ్యక్తిగతంగా, తన భార్య భువనేశ్వరీ సైతం విమర్శించారంటూ.. ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెడుతానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సభను నిష్ర్కమించారు. అయితే అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఒక్కసారిగా విలపించారు. దీంతో తమ అభిమాన నేతను కించపరిచేలా మాట్లాడారని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. అంసెబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించారని ఆరోపణలు చేస్తూ ఏపీలో టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వైసీపీ నాయకుల మాటలను ఖండిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సదరు హెడ్ కానిస్టేబుల్ ఓ వీడియో విడుదల చేశారు. తను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998…
ఈరోజు ఏపీ శాసనసభలో జరిగిన విషయమై స్పందించారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… ఈ రోజు శాసన సభలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. శాసనసభ హుందాతనం, గౌరవం కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు హృదయాలను గాయపరుస్తాయి. ఈ రోజు సంఘటన శాసనసభకు మాయని మచ్చగా భావించాలి అని తెలిపారు.…
పదవి కోసం ‘జయప్రదం’గా అద్భుతంగా నటిస్తున్నావు చంద్రబాబు అని ట్విట్టర్ లో టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. మాధవరెడ్డి పేరు ఎత్తగానే పెడబొబ్బలు సోకాలు పెడుతున్నావు. మరి నీ పుత్రరత్నం పప్పు నాయుడు మమ్మలిని అందరినీ సోషల్ మీడియాలో క్యారక్టర్ అససనేషన్ చేసినప్పుడు ఏమైంది నీ పెద్దరికం ఇంగితజ్ఞానమ్ అని అడిగారు. చంద్రబాబు… మా అందరివి కుటుంబాలు కావా… మా అందరివి సంసారాలు కావా… మా భార్య పిల్లలు భాదపడరా అని అడిగారు. నిన్ను…
చంద్రబాబు అసెంబ్లీకి వచ్చిన చివరి రోజు ఈరోజేనని మంత్రి కొడాలి నాని అన్నారు. రాజకీయంగా బతకడానికి చంద్రబాబు నీచ రాజకీ యాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి కోసం భార్యను కూడా బజారుకు ఇడ్చాడన్నారు. చంద్రబాబు అసెంబ్లీలో జగన్ను ఎన్ని తిట్టించాడో గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్ నుండి పార్టీ లాక్కుoటే..ఎన్టీఆర్ కూడా ఇంతకన్నా ఎక్కువ ఏడ్చాడన్నాడు.చంద్రబాబు లాగా బయటకు వచ్చి ఏడ్వలేదన్నారు. చంద్రబాబు సతీమణి పై ఎవరు వ్యాఖ్యలు చేశారో,…
కుటుంబ సభ్యులను కించపరటం తగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదన కలిగి స్తున్నాయన్నారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చే స్తుంటే ప్రజా ప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమ ర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరంగా ఉందని, ప్రజా సం క్షేమం నాయకులకు పట్టదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం…
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కె రోజా మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై తనదైన రీతిలో విమర్శలు చేశారు. రోజా బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిందని సీడీలు చూపించింది మర్చిపోయావా బాబు అన్నారు రోజా. విధి ఎవరినీ విడిచిపెట్టదన్నారు. 72 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ ని ఎంతగా ఏడిపించావో గుర్తుందా? 71 ఏళ్ళ 7 నెలలకే నీకా పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే మనకి అదే పరిస్థితి వస్తుందని. నీ…
ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు శపథం చేసి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ప్రెస్మీట్లో కంటతడి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. రెండున్నరేళ్లుగా అన్ని విధాలా అవమానిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. నేను ప్రజల కోసమే పోరాటం చేశా. ఓడిపోయినపుడు కుంగిపోలేదు…గెలిచినపుడు రెచ్చిపోలేదు. ప్రతిపక్ష నేతలను నేనెప్పుడూ అగౌరవపరచలేదన్నారు చంద్రబాబు. తాను సీఎంగానే మళ్ళీ అడుగుపెడతానని శపథం చేశారు చంద్రబాబు. మరి ఏపీ రాజకీయాలు భవిష్యత్తులో ఎలా మారతాయో చూడాలి. ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైంది మొదలు టీడీపీతో…