చంద్రబాబు నేటి ఉదయం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రోజా. తిరుపతిలో మీడియా ముందు చంద్రబాబు మాట్లాడిన విధానం చూస్తుంటే త్వరలోనే చంద్రబాబును పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయించాలని అందరికీ అర్థమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో భారీ వర్షాల కారణంగా సరిహద్దు ప్రాంతాలను సీఎం జగన్ అప్రమత్తం చేశారని.. అంతేకాకుండా ఆ తరువాత భారీ వర్షాలతో నష్టపోయిన జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు…
అమరావతి : జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 12 గంటల పాటు భార్యతో కలిసి తన నివాసంలో నిరసన చేపడుతున్నారు వర్ల రామయ్య. అయితే… ఈ సందర్బంగా వర్ల రామయ్య మాట్లాడుతూ…. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ…
చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ.. నిన్న విశాఖపట్నంలోని నర్సీపట్నం టీడీపీ నేత అయ్యపాత్రుడు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ధర్నా కాస్తా పోలీసుల ఎంట్రీతో రసభాసగా సాగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, చింతలపూడి విజయ్ సహా 16 మందిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.…
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో…. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా…చాలా ప్రాంతాల్లో వరదలు విషాదాన్ని సృష్టిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే… ఇవాళ చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాయల చెరువు వద్ద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ…
వరదలను ఎదుర్కొవడంలో రాష్ర్టం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అసలు రాష్ర్టంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందా అంటూ ప్రశ్నించారు. వర్షాలపై ప్రభుత్వం ఏ మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని, మానవ తప్పిదం వల్లే ప్రకృతి విలయం సృష్టించిందన్నారు. వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపినప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆయన మండి పడ్డారు. జలాశయాల నిర్వహణను గాలికి వదిలేశారన్నారు.…
తాడేపల్లి అరాచకాలు తాలిబాన్లను మించిపోతున్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.. వైసీపీకీ రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్త సైదాపై వారి కార్యకర్తల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ కార్యకర్త సైదాపై నాలుగు రోజుల క్రితమే దాడి జరిగినా కేసు పెట్టరా.? అంటూ పోలీసులపై విమర్శనాస్త్రాలను సంధించారు. పోలీసులు ఉన్నది కాపాడడానికా..? రెడ్ కార్పెట్ వేసి దాడులు చేయించడానికా అంటూ పోలీసులపై అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.…
ప్రకృతికి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదని, అలా చేసినందు వల్లనే స్వర్ణముఖి నది బ్రిడ్జ్‌లు, కాజ్ వేలు కొట్టకుపోయానని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఆయా జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీసీపీ నేతలపై మాటల తూటా లు పేల్చారు. ఇక్కడి నేతలు చెరువులను కబ్జా చేసి క్రికెట్ గ్రౌండ్లు గా మార్చారన్నారు. దీని వల్లనే తిరుపతి మునిగిపోయిందన్నారు. నాలుగు రోజులు ప్రాణాలు అరచేతిలో…
జగన్ సర్కార్ పై మరోసారి రెచ్చి పోయారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతిలోని పాప నాయుడు పేట వద్ద వరద భాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వరి వేయద్దు అంటున్నారు, గంజాయి ఎయ్యాలా? అని నిప్పులు చెరిగారు. ప్రపంచంలో నే ఏపీ కి చెడ్డపేరు తెప్పిచ్చారని… ఇది ప్రజాస్వామ్యం కాదు. ఉన్మాద స్వామ్యమని నిప్పులు చెరిగారు. మడమ తిప్పను అని గిరగిరా తిప్పుతూనే ఉన్నాడు. తుగ్లక్ నయం ఈ జగన్ తుగ్లక్ కంటే అంటూ…
మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాడే పల్లిలోని మహానాడు ప్రాంతం లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. శాసనసభలో మా తల్లిని అవమానించారు. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించు కున్నారని లోకేష్ అన్నారు. కరోనా నుంచి కోలుకున్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు…