అనంతపురంలో మల్లాది వాసును కీర్తిస్తూ ఫ్లెక్సీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురంలో అజ్ఞాత అభిమానుల హడావిడి టీడీపీలో కలకలం రేపుతోందా? పేరు.. ఊరు లేకుండా వెలిసిన ఫ్లెక్సీలు ఇస్తున్న సంకేతాలేంటి? వాటి వెనక పార్టీ ఉందా లేక సామాజికవర్గం కోణం ఉందా? ఇంతకీ ఏంటా ఫ్లెక్సీల గోల..!
మల్లాది వాసును కీర్తిస్తూ ఫ్లెక్సీలు..!
Also Read
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రాజుకున్న రాజకీయ సెగల్లో.. వేలు పెట్టారు తెలంగాణకు చెందిన మల్లాది వాసు. వనభోజనాల్లో మల్లాది వాసు చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చగా మారాయి. వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ చేశారు. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ రకరకాలుగా మలుపులు తిరుగుతోంది. వాసు చేసిన కామెంట్స్‌తో వచ్చిన సమస్య సమసిపోతుంది అని అనుకుంటున్న తరుణంలో అనంతపురం జిల్లాలో అలజడి మొదలైంది. మల్లాది వాసును కీర్తిస్తూ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆయన పేరున యువసేనలు పుట్టుకొచ్చాయి. దీంతో వీటి వెనక ఎవరు ఉన్నారు? ఫ్లెక్సీలు కట్టి ఇస్తున్న సంకేతాలేంటి అనే ప్రశ్నలు జిల్లాలో చర్చగా మారాయి.
పక్కా ప్లాన్‌తోనే ఫ్లెక్సీలు పెట్టారా?
అనంతపురంలోని బళ్లారి రోడ్డులో మాల్లాది వాసు అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు పుట్టుకొచ్చాయి. కొన్ని ఫ్లెక్సీలలో హిందూపురం, ధర్మవరం అభిమానులు.. ఇట్లు మల్లాది యువసేన అని ప్రింట్ చేశారు. ఆ ఫ్లెక్సీలలో మల్లాది వాసు ఫొటోతోపాటు మాజీ సీఎం ఎన్టీఆర్, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఇమేజ్‌లు పెట్టారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా తెలుస్తోంది. అవి కూడా రాత్రికి రాత్రి ఒకేసారి కట్టేశారు. ఎవరి కంట పడకుండా.. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు ప్లేస్‌లు ఎంచుకుని ఫ్లెక్సీలను వేళ్లాడదీశారు. సాధారణంగా ఫ్లెక్సీలలో ఏదో ఒక మూల ప్రింటింగ్ ప్రెస్ పేరు ఉంటుంది. మల్లాది వాసు పేరుతో వెలిసిన ఫ్లెక్సీలలో అది కూడా లేకుండా జాగ్రత్త పడటం.. అజ్ఞాత అభిమానుల జాగ్రత్తలకు అద్దం పడుతుంది.
ఫ్లెక్సీలు పెట్టిన వారి గురించి ఆరా తీస్తున్న పోలీసులు..!
ఫ్లెక్సీలపై ఒకవైపు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతుంటే.. మరోవైపు పోలీసులు సైలెంట్‌గా జల్లెడ పడుతున్నారు. ఎవరీ పని చేశారు? వీటి వెనక ఉన్నదెవరు? అనేది కూపీ లాగుతున్నారట. టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే.. మాకేం సంబంధం అని ముఖంమీదే చెప్పేస్తున్నారట. ఈ సమస్య అటు ఇటు తిరిగి తమ మెడకు ఎక్కడు చుట్టుకుంటుందో అని ఆంతరంగిక సమావేశాల్లో ఆందోళన చెందుతున్నారట తెలుగు తమ్ముళ్లు.
పోలీసులు ఒక అంచనాకు వచ్చారట..!
మల్లాది వాసు చేసిన కామెంట్స్‌ను టీడీపీ నేతలు ఖండించలేదు.. అలాగని మద్దతు ప్రకటించలేదు. అలాంటప్పుడు ఫ్లెక్సీలు కట్టింది ఎవరు? దీనిపై పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారట. మొత్తం మీద మల్లాది వాసు తెలంగాణలో చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లోకే కాదు.. జిల్లాలకు కూడా పాకాయి.
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!