కుప్పం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో అందరూ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తారు.. ఒక్కప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీదే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేది.. అయితే, ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీ కాస్త వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడిపోయింది.. ఏకంగా చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినా.. అధికార వైసీపీ ఎత్తుల ముందు చిత్తైపోయారు.. అయితే, ఇవాళ కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములపై అభ్యర్థులు, నేతలతో మాట్లాడనున్నారు.. అయితే, కుప్పం ఫలితాల చంద్రబాబు సమీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also: రైతుల ఆందోళనల విరమణ..! నేడే తుదినిర్ణయం..
కుప్పంలో ఓటమికి చంద్రబాబు ఎవర్ని తప్పు పడతారోనని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది… కుప్పంలో పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోసం చాలా కాలంగా ఇంఛార్జ్‌లుగా వ్యవహరిస్తోన్న నేతల వైఖరిని ఇప్పటికే కుప్పం పార్టీ కార్యకర్తలు తప్పుబడుతున్నారు.. దీంతో చంద్రబాబు ఎలా స్పందిస్తారోనని పార్టీ వర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.. మరోవైపు కుప్పంలో స్థానిక నాయకత్వాన్ని వేరేవారికి అప్పగించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.. కొత్తవారికి కుప్పం బాధ్యతలు అప్పగించే యోచనలో చంద్రబాబు ఉన్నారని సమాచారం. కుప్పం స్థానిక నాయకత్వంలో టీడీపీలో సమూల మార్పు కోరుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు. మరోవైపు.. కడప జిల్లా రాజంపేట మున్సిపల్ ఎన్నికలపై కూడా సమీక్షించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.