చంద్రబాబుపై మరోమారు ఫైర్ అయ్యారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. చంద్రబాబు కుప్పంను కబ్జా చేసి కోటలాగా మార్చుకున్నాడని… కుప్పంలో చంద్రబాబును దారుణం ఓడించారని ఆగ్రహించారు. అమరావతి యాత్ర ప్రజల యాత్ర కాదు.. టీడీపీ నేతలే యాత్ర చేస్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబుకు ఎక్కడో చోట గొడవ కావాలి.. అదే ఆయన రాజకీయం అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని ఆగ్రహించారు. అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాజకీయ పదవుల్లో కూడా సీఎం జగన్ అవకాశాలు కలిపిస్తున్నారని కొనియాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన టీడీపీ శాసన మండలిలో మంద బలంతో అనేక సంస్కరణలను అడ్డుకున్నారని…పేదలకిచ్చే ఇళ్ల స్థలాలపై టీడీపీనే కోర్టుకు వెళ్లి అడ్డుకుందని మండిపడ్డారు. చాలా ఏళ్ళు పాటు ఇళ్లు వున్నా వారికి అది ఆస్తిగా లేకుండా పోయిందని… ఇప్పుడు పేదలకు ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నా.. దానిపై దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షం వుండటం మన దురదృష్టమని పేర్కొన్నారు. మరో 2,3 దశాబ్దాలుగా సీఎంగా జగనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.