ఏపీలో వరి వార్ మొదలైంది. తెలంగాణలో వరి వేయవద్దంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. ఏపీలో కూడా వరి వేయవద్దంటూ అధికారి వైసీపీ నేతలు చెప్పడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై స్పందించిన టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ సీఎం జగన్, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ.. జగన్ చర్యలతో వ్యవసాయం కుదేలైందని, సీఎం జగన్ ఏపీలో వరిపంటకు ఉరివేశాడంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి కనీస అవగాహన లేకుండా మాట్లాడతున్నారని, వరి పంట వేయవద్దంటే.. గంజాయి పంట వేయిస్తారా అంటూ చురకలు అంటించారు. రైతు ప్రయోజనాల కోసం జగన్ మోడీతో పోరాడాలని ఆయన అన్నారు.