అమరావతి డీజీపీ గౌతమ్ సవాంగుకు చంద్రబాబు లేఖ రాశారు. కర్నూల్ జిల్లా కోసిగి మండలంలో టీడీపీ పార్టీ నేత తిక్కారెడ్డి పై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు చంద్రబాబు. బొంపల్లెలో ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు దాడి చేశారని… వైసీపీ కార్యకర్తల దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంవో పోలీసులు విఫలం అవుతున్నారని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని కోరారు.