మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రైల్వే జోన్‌పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
అంతేకాకుండా విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ రైల్వే జోన్‌పై ఏం సమాధానం చెబుతారన్నారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా రాష్ట్రాన్ని పాలిస్తారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న జగన్ ఇప్పుడు మౌనమెందుకు వహిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కుపై లాలూచీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.