ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. వారిని సస్పెండ్ చేయడం నిత్యకృత్యంగా సాగుతుండగా.. ఇవాళ ఘర్షణ వరకు దారి తీసింది.. సభలో టీడీపీ ఎమ్మెల్యే డోలా, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. జీవో నంబర్ 1ను రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది..…
Kakani Govardhan Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ వచ్చింది.. ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.. ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇక 2024 ఎన్నికల్లోనూ ఈ ఫలితాలు రిపీట్ అవుతాయని చెబుతున్నారు.. అయితే, ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు అంటూ హాట్ కామెంట్లు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే పార్టీ…
MLC Elections 2023: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి.. ఈ నెల 23వ తేదీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే దీనిపై తమ ఎమ్మెల్యేలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా విప్ జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని.. 23వ తేదీ పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలని విప్ జారీ చేసింది వైసీపీ.. అయితే, విప్ ధిక్కరిస్తే…
ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకవైపు జీవో 1ను రద్దు చేయాలని టీడీపీ, వామపక్షాల అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.. మరోవైపు తమ సమస్యలు నెరవేర్చాలంటూ చలో విజయవాడకు పిలుపు
తెలంగాణలో వచ్చేసారి ఎలక్షన్స్ లో చేస్తా.. ఏపీలో నేను పోటీ చేయకపోవడం వల్లే టీడీపీ గెలిచిందన్న కేఏ పాల్.. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయకపోవడం వల్లే అక్కడ టీడీపీ పార్టీ గెలిచిందని కేఏ పాల్ వెల్లడించారు.
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. ప్రతీ రోజూ అసెంబ్లీకి రావడం.. ఏదో విషయంపై చర్చకు పట్టుబట్టడం లేదా సభను అడ్డుకోవడంతో ఈ సస్పెన్లు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ రోజు కూడా 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఒకరోజు పాటు వారిని సస్పెండ్ చేశారు.. విద్యుత్ మీటర్ల అంశంపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ సభ్యులు.. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టి నిరసనకు దిగారు..…
Vishnu Kumar Raju: ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించలేకపోయింది.. అయితే, ఈ ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్లు చేశారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై రాష్ట్ర నాయకత్వం అంతర్మథనం చేసుకోవాలని సూచించారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిందన్న ఆయన.. అందుకు ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనంగా చెప్పుకొచ్చారు..…
Andhra Pradesh Assembly: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ఆందోళన పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ సభ ప్రారంభం అయిన వెంటనే ఆందోళనకు దిగారు తెలుగుదేశం పార్టీ సభ్యులు.. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు.. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.. కాగా, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం…