Minister RK Roja:జగనన్న వన్స్‌మోర్ అని ప్రజలు అంటున్నారు.. అధికారంలోకి వస్తామనేది టీడీపీ పగలి కలే అని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. 2019 నుండి ఎక్కడా గెలవకపోవడంతో టీడీపీ నాయకులు పిచ్చెక్కిపోయారు.. శవాల నోట్లో తులసి తీర్థం పోసిన విధంగా టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయి.. ఆ ఎమ్మెల్సీలు సొంత ఓట్లు, సింబల్‌తో గెలవలేదు.. అయినా పెద్ద ఘనకార్యం సాధించినట్లు సంబరాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు.. కానీ, వాళ్ల అహంకారం కళ్లు నెత్తికెక్కి అసెంబ్లీలో స్పీకర్ ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Talasani Srinivas Yadav: తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారు
బీసీ కులానికి చెందిన స్పీకర్‌ను అవమానించి దాడికి యత్నించడం ఎంత వరకు సబబు? అంటూ ఫైర్ అయ్యారు రోజా.. చేసిన తప్పును సమర్థించుకోవడానికి మా నాయకులపై నిందలు వేయడం సిగ్గు చేటన్న ఆయన.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల జాతి వాళ్లకు పదవులు ఇస్తారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితులను ముందు పెట్టి అన్యాయం చేస్తున్నామని చెప్పడం దురదృష్టకరం అన్నారు. ఇక, జీవో నంబర్ 1 కోసం తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎప్పుడైనా ప్రజా సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చిందా? అని నిలదీశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేస్తే ప్రజా రక్షణ బాధ్యతతో జీవో నంబర్ వన్‌ను తీసుకొచ్చామన్న రోజా.. ఆ జీవో ప్రజలకు రక్షణ కల్పించడానికే.. జీవో రద్దు అంటే ప్రజలను చంపడానికి అవకాశమివ్వడమే అన్నారు. వాళ్లకు ఎమ్మెల్సీలు వస్తే ఏం జరిగదు.. 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారు.. టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే అన్నారు. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అంటూ హెచ్చరించారు మంత్రి ఆర్కే రోజా.