MLA Sudhakar Babu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఇప్పటి వరకు ఆరోపణలు, విమర్శలు, వాగ్వాదాలు, ఆందోళనలు, నిరసనకే పరిమితమైన సభ.. ఇప్పుడు ఘర్షణ వరకు వెళ్లింది.. జీవో నంబర్ వన్‌కి వ్యతిరేకంగా స్పీకర్ పోడియం దగ్గర ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులు.. స్పీకర్‌తో అనుచితంగా ప్రవర్తించారని.. అడ్డుకునేందుకు యత్నిస్తే దాడి చేశారని చెబుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.. అయితే, అసెంబ్లీ ఘటనలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు చేతికి గాయం అయ్యింది.. దీంతో, చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సుధాకర్‌బాబు.. నా పై చంద్రబాబు దాడి చేయించారని విమర్శించిన ఆయన.. నా రక్తం కళ్ల చూశారు.. ఇది చట్ట సభలకు చీకటి రోజుగా అభివర్ణించారు.. తెలుగుదేశం ఎమ్మెల్యేలు డోలా, బెందాళం అశోక్ స్పీకర్ పై దాడికి పాల్పడితే.. మేం అడ్డుకోవటానికి వెళ్లాం.. నన్ను తోసేస్తే కింద పడిపోయాను.. ఆ తర్వాత డోలా కింద పడ్డారని తెలిపారు.. ఇటువంటి ఎమ్మెల్యేలకు సభలో ఉండే అర్హత లేదన్నారు.. బీసీ స్పీకర్, దళిత ఎమ్మెల్యే పై టీడీపీ ఎమ్మెల్యేలు దాడికి పాల్పడటం హేయమైన చర్యగా మండిపడ్డారు ఎమ్మెల్యే సుధాకర్ బాబు.
Read Also: Big Breaking: ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..!