అసెంబ్లీలో జరిగిన ఘటన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా ఉందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు. ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం సంయమనం పాటించాలి..జీవో నంబర్ 1కి వ్యతిరేకంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి..స్పీకర్ ను ప్రశ్నిస్తే మార్షల్స్ ద్వారా నియంత్రించాలి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవటం ఏంటి..టీడీపీ ఎమ్మెల్యే స్వామిపై జరిగిన దాడి అప్రజాస్వామికం..విజయవాడలో ధర్నా చౌక్ కు పోయే దారులు మొత్తం మూసివేశారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని రోడ్లపైనే అరెస్టులు చేశారు..సీఎం జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలనే అమలు చేయాలని అంగన్వాడీలు నిరసనలు చేస్తున్నారు..ఇక్కడ అమలు జరుగుతుంది ప్రభుత్వ రాజ్యాంగమా.. పోలీసుల రాజ్యాంగమా..ప్రజలు సమస్యలపై వీధుల లోకి వచ్చి తమ హక్కుల కోసం పోరాటం చేస్తే అడ్డుకోవటం సరికాదు..బడ్జెట్ సమావేశాలు కనీసం 21 రోజులు నిర్వహించాలి.. కానీ తూతూ మంత్రంగా మమ అనిపిస్తున్నారు..ఉగాది పండుగకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అన్నారు.. ఇప్పుడా పరిస్థితి లేదు..ప్రాజెక్టులు పూర్తి చేయటంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
Read Also: Bhatti Vikramarka: కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర.. పాల్గొననున్న ఎమ్మెల్యే సీతక్క
అసెంబ్లీలో సీఎం జగన్ ఎంత సేపు కూర్చున్నారో కానీ విశాఖ సమిట్ లో మాత్రం నాలుగు గంటలు కూర్చున్నారు..నాలుగు గంటలు సీఎం జగన్ అధానీ భార్యతో ఏం చర్చలు జరిపారో చెప్పాలి.. అదానీ వల్ల దేశ ప్రతిష్ట మంటగలిసింది..విశాఖ ఉక్కు కోసం సీఎం జగన్ ఢిల్లీకి డెలిగేట్స్ ను తీసుకువెళతారు ని ప్రకటించారే కానీ పట్టించుకోలేదు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బరిలో ఉండటం వల్లే పీడీఎఫ్ అభ్యర్ధులు ఓడారు..ప్రైవేట్ స్కూళ్ళలో అర్హత లేని వాళ్ళకు ఓటు హక్కు కల్పించటం వల్లే వైసీపీ అభ్యర్ధులు గెలిచారు..వైసీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత రావటం వల్లే గ్రాడ్యుయేట్స్ ఓడారు..అన్నీ రంగాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైందన్నారు శ్రీనివాసరావు.
Read Also: Pakisthan : నన్ను కోర్టులో చంపేయొచ్చు.. చీఫ్ జస్టిస్ కు ఇమ్రాన్ లేఖ