ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన ముగ్గురూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందునా మూడు రాజధానుల పేరుతో వైసీపీ తమకే పరిస్థితి అనుకూలంగా ఉందని భావిస్తే.. ఉత్తరాంధ్రలోనే ఓటర్లు వైసీపీకి బుద్ధి చెప్పారు. అక్కడ విద్యావేత్త వేపాడ చిరంజీవిరావు టీడీపీ ఎమ్మెల్సీ గెలిచారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను.నాకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం చంద్రబాబు ఇచ్చారు.ప్రస్తుత వైసీపీ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు.పట్టభద్రులు మరింత అసంతృప్తితో ఉన్నారు.
Read Also: MLC Ramagopal Reddy: గెలిచాక కూడా చాలా ఇబ్బంది పెట్టారు
ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అంతా నిరాశలో ఉన్నారు.డీబీటీ స్కీంలతో వైసీపీ ఓట్లు దండుకోవడమే పనిగా పెట్టుకుంది.పారిశ్రామిక రంగం కుంటుపడింది.గతంలో ఏపీకి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండేది.. కానూ ఇప్పుడు ఆ బ్రాండ్ పోయింది.ఇంటింటికి ప్రచారానికి వెళ్తే ఇంటికి రావద్దు.. మేం ఓటేస్తామని చెప్పారు.పార్టీ ఇన్ఛార్జులు.. అబ్జర్వర్లు చక్కగా పని చేశారు.కార్యకర్తల సహకారం మరువలేనిది. ఉదయం ఐదు గంటలకు చంద్రబాబు ఫోన్ చేసి మరీ నిద్ర లేపారు.చంద్రబాబే అంతగా కష్టపడుతున్నారు.. మేం కష్టపడకపోతే ఎలా అని పని చేశాం అన్నారు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు.
Read Also: Chandrababu Naidu: అధికారులు ఆలోచించి పనిచేయాలి