Deputy CM Narayana Swamy: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.. జీవో నంబర్ 1పై వాయిదా తీర్మానం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ.. ఆ వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది.. అందులో భాగంగా.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు టీడీపీ సభ్యులు.. ప్లకార్డులు ప్రదర్శించారు, పేపర్లు చించివేశారు, పోడియం ఎదుట బైఠాయించారు.. జీవో నంబర్ 1కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. స్పీకర్‌పై టీడీపీ ఎమ్మెల్యేలు దాడికి యత్నించారని.. వారిని ఆపడానికే వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లారని చెబుతున్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి..
Read Also: MLA Sudhakar Babu: ఇది చట్ట సభలకు చీకటి రోజు.. నా రక్తం కళ్ల చూశారు..
అసెంబ్లీలో ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన నారాయణస్వామి.. నన్ను టీడీపీ ఎమ్మెల్యేలు దూషించారు.. సుధాకర్ బాబు, ఎలిజా ఇద్దలినీ తోసేసి కింద పడేశారు.. నన్ను రారా.. నా కొడకా.. డిప్యూటీ సీఎం అంటూ దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, స్పీకర్ తమ్మినేని సీతారాంపై చేయి వేశారు.. స్పీకర్‌ను కాపాడటానికే ఎమ్మెల్యేలు ఎలిజా, సుధాకర్ బాబు పోడియం దగ్గరకు వెళ్లారని వెల్లడించారు.
నేను పోడియం కిందనే ఉన్నా .. నన్ను కూడా దూషించారు.. బాల వీరాంజనేయులు, ఆయన వెనుక బుచ్చయ్య చౌదరి, మరో ఇద్దరు చౌదరిలు ఉన్నారని.. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తానని తెలిపారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.