ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు ఘర్షణ వాతావరణం చర్చగా మారింది. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.. అయితే, స్పీకర్‌పై చేయి చేసుకున్నారు.. అడ్డుకుంటే తోసివేసి దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.. ఇదే సమయంలో.. సభలో టీడీపీ దాడి ఘటనపై క్యాంపైన్ చేపట్టారు ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. టీడీపీ వైఖరిని ఖండిస్తూ సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.. టీడీపీ రౌడీస్ ఇన్ అసెంబ్లీ, వైఎస్సార్ దళిత ఎమ్మెల్యే అటాక్డ్ ఇన్ అసెంబ్లీ (#TDPRowdiesInAssembly, #YSRCPDalitMLAattackedInAssembly) అనే హ్యాష్ టాగ్ లను వైరల్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు..
స్పీకర్ తమ్మినేని సీతారాం, దళిత ఎమ్మెల్యే సుధాకర్ లపై దాడి అమానుషం అంటూ ట్వీట్ చేస్తున్నారు నేతలు.. ఇక, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చేసిన ట్వీట్లను ఓసారి పరిశీలిస్తే..
* సుధాకర్‌బాబు పై దాడి హేయమైన చర్య, ఇది ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే : గడికోట శ్రీకాంత్ రెడ్డి
* స్పీకర్ ను తిట్టిస్తూ, రచ్చ చేస్తున్న టీడీపీ సభ్యులను శాశ్వతంగా సస్పెండ్ చేయాలి : ఆర్కే రోజా
* దళితుడిని ముందు పెట్టి రాక్షసానందం పొందుతున్న చంద్రబాబును శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా చేయాలి : బియ్యపు మధుసూదనరెడ్డి
* స్పీకర్ పై దాడి చేసిన సంస్కార హీనుడు డాలాపై కఠిన చర్యలు తీసుకోవాలి : బాలినేని శ్రీనివాసరెడ్డి
* శాసన సభ సాక్షిగా దళిత ఎమ్మెల్యే సుధాకర్ పై దాడి చేయటం హేయమైన చర్య, ఇవ్వాళ బ్లాక్ డే : నందిగం సురేష్,ఎంపీ
* స్పీకర్, ఎమ్మెల్యేపై దాడి హేయమైన చర్య, ఇవ్వాళ బ్లాక్ డేగా చెప్పుకోవాలి :పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి
* ఈ దాడి విషయం రాజ్యాంగ వ్యవస్థలో సరైన పద్దతి కాదు, బీసీ వర్గానికి చెందిన స్పీకర్ పై దాడి ఏపీ చరిత్రలో బ్లాక్ డే : చింతల రామచంద్రారెడ్డి
* బీసీలపై దాడి ద్వారా ఆ పార్టీకి బీసీలపై ఉన్న కపట ప్రేమ కనపడుతోంది : మార్గాని భరత్, ఎంపీ
* సభలో ప్రతిరోజూ ఎస్సీ నేతలతో తిట్టించటం, పోడియాన్ని చుట్టుముడుతున్న టీడీపీ సభ్యులను సభ నుండి బహిష్కరించాలి : పుష్పశ్రీవాణి ఇలా చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు..