మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కరెడ్డి, ఉరుకుంద(ఈరన్న) లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నాగరాజు స్వామి సేవా సంఘం హాల్ నందు జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొని పాలకుర్తి తిక్కరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి వెన్నెముక లాగా ఉన్నారని, బీసీల పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ, బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పెంచి, బీసీ సబ్ ప్లాన్,…
వచ్చే ఎన్నికల్లో నన్ను పోటీ చేయమంటారా? వద్దా..? మీరు చెప్పినట్టే చేస్తాను.. చేతులు ఎత్తి మీ అభిప్రాయాన్ని చెప్పండి అని కోరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
బెజవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో రాధా, ఉమా వర్గీయుల మధ్య పోరు ముదురుతోంది. వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని కామెంట్ చేశారు ఎమ్మెల్యే వసంత.. ఇప్పుడున్న సమకాలీన పరిస్ధితుల్లో ప్రజా ప్రతినిధులుగా కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నాం అన్నారు.. ఈ కాలంలో పని చేస్తున్న శాసనసభ్యులం ఒక రకంగా అదృష్టవంతులం, ఒక రకంగా దురదృష్టవంతులం.. అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే చాలా సమస్యగా ఉంది.. ప్రజలు అనుకున్న రీతిలో నిధులు కేటాయించలేక పోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్.
మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే.. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా ఆమోదిస్తారా..? అని ప్రశ్నించారు ఘంటా శ్రీనివాసరావు. ఈ ఘటనతో సీఎం వైఎస్ జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోంది. జగన్‌ది రాజకీయ దివాళాకోరు తనమే. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు నన్ను సంప్రదించకుండానే ఆమోదించారని తెలిపారు