టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించి.. ఆ పార్టీకి షాక్ ఇచ్చారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. దాదాపు మూడేళ్ల కిందట.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంటా.. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు రాజీనామాను ఆమోదించడం హాట్ టాపిక్‌గా మారింది.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో విజన్ కలిగి ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు అని అన్నారు. పాదయాత్ర చేసి యువత ఎదురుకుంటున్న సమస్యలు, ఉద్యోగ, ఉపాధి సమస్యలు తెలుసుకుంటూ.. రైతులు,…
ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో టీడీపీ నేత కేశినేని చిన్ని తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్‌కు ముఖ్య అనుచరుడుగా మారాడని.. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుకే నాని తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై మరోసారి వైసీపీ, టీడీపీ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. కొత్త ఆరోపణలను రెండు పార్టీలు తెరపైకి తెచ్చాయి. వైసీపీలో మారిన ఇన్ఛార్జ్లు తమ అనుచరులను కొత్త నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేరుస్తున్నారని టీడీపీ ఆరోపించింది. జనసేనకు ఇచ్చే సీట్లలోని టీడీపీ ఓటర్లను వేరే నియోజకవర్గాలకు మారుస్తున్నారని వైసీపీ ఆరోపించింది.
ముఖ్యమంత్రి జగన్ పథకాల పేరుతో ప్రజలను దగా చేసాడని.. ఈసారి జగన్ మాయమాటలు నమ్మి ఓటేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లేనని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటాపురం, పండ్లపురం గ్రామాల్లో పర్యటించిన బీసీ జనార్థన్ రెడ్డి.. బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లలో కరెంటు బిల్లులు మూడు రెట్లకు పైగా…
పొత్తులో భాగంగా టీడీపీ హైకమాండ్‌కు వివిధ జిల్లాల్లోని కీలక సెగ్మెంట్లు సంకటంగా మారుతున్నాయి. పెందుర్తి, రాజమండ్రి రూరల్, పిఠాపురం, కాకినాడ, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమం, తెనాలి సెగ్మెంట్లపై టీడీపీ ఏటూ తేల్చుకోలేకపోతోంది. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నేతలు రోజురోజుకూ ఒత్తిడి పెంచుతున్నారు. తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ టీడీపీ అధిష్టానానికి పశ్చిమ నేతల వినతులు ఇస్తున్నారు. విజయవాడ పశ్చిమం నుంచి బీసీ వర్గానికి చెందిన బుద్దా వెంకన్న టిక్కెట్ ఆశిస్తున్నారు. కాగా.. రేసులో మైనార్టీ వర్గం నుంచి…
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గతేడాది జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై సీఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.