కృష్ణా జిల్లాలో కాక రేపుతున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.. మైలవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్లా తెలుగుదేశం పార్టీ సర్వేలు చేపట్టింది.. రెండు చోట్లా టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లతో సర్వే నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే.. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారట.. తిరుపతి జిల్లా సత్యవేడు (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన అధికార వైసీపీకి చెందిన శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం..
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. ఆ దిశగా మనమంతా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బోడే ప్రసాద్.. నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన కష్టపడి పనిచేయాలి.. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవాలి.. ముందుకు సాగాలి అన్నారు.
ఏపీలో సైకో పాలన కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. రాజమండ్రిలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిలో ఆడపిల్లకు సమాన వాట ఇవ్వాలని ఎన్టీఆర్ పని చేస్తే, చట్టాలు చేస్తే.. ఈ రోజు వైఎస్ బిడ్డకు సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఏం జగన్ ది అని దుయ్యబట్టారు. ఆడపిల్లల పై దాడులు చేస్తున్న ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్నా.. ఆడబిడ్డల…
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీడీపీ-వైసీపీ పోటాపోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు సి.ఎం. రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ లో ముగియనుంది. ఈ మూడింటికి మూడు దక్కించుకోవాలని వైసీపీ వ్యూహం పన్నుతుంటే.. అందులో ఒక్కటైనా దక్కించుకోవాలని టీడీపీ చూస్తోంది. సీటు గెలుచుకోవడానికి మ్యాజిక్ ఓట్ల సంఖ్యపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
మానవ సేవే.. మాధవ సేవ అని నమ్మి బనగానపల్లె నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్నారు నిస్వార్థ ప్రజా సేవకులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి. బనగానపల్లె నియోజకవర్గంలో అంతిమ యాత్ర, దహన ప్రక్రియలకు పేద కుటుంబాలు ఇబ్బంది పడకుండా.. ఉచితంగా శాంతి రథం, ఫ్రీజర్ బాక్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ తగిన ఆర్థిక సాయం అందిస్తూ అండగా…