Gadikota Srikanth Reddy: అన్నమయ్య జిల్లా రాయచోటి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.. భావితరాలను దృష్టిలో ఉంచుకుని రాయచోటి ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని వెల్లడించిన ఆయన.. ప్రతిపక్ష పార్టీ వాళ్లకు నాపై అసత్య ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.. వాళ్లు అభివృద్ధి చేయరు, అభివృద్ధి చేసే నాపై నిందలు వేస్తారంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో రాయచోటిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? అని నిలదీశారు. రాయచోటికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నుంచి నేటి వరకు నేను చేసిన అభివృద్ధిని చూపిస్తా.. తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు చేసిన అభివృద్ధిని చూపిస్తారా..? అంటూ రమేష్‌కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.
Read Also: TTD: శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెల విశేష పర్వదినాలు ఇవే..
ఇక, నిజాయితీగల ఐఏఎస్ అధికారి గిరీషాపై ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు.. తిరుపతిలో జరిగిన ఘటనకు ఐఏఎస్ అధికారికి ఎలాంటి సంబంధం లేదు, ఎవరో ఓ వ్యక్తి కలెక్టర్ లాగిన్ తీసుకొని తప్పు చేశాడు.. అందుకు కలెక్టర్ బాధ్యుడు కాదు.. అది కూడా నిరూపణ అయ్యిందని వెల్లడించారు.. అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదట జిల్లా కలెక్టర్ గా వచ్చిన ఐఏఎస్ అధికారి గిరీషా సహకారంతో రాయచోటి ఎంతో అభివృద్ధి చెందింది. నీతి నిజాయితీ గల కలెక్టర్ పై ఆరోపణలు చేయడం తగదు అని వార్నింగ్ ఇచ్చారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.