Atchannaidu: ఎన్నికల సంఘానికి టీడీపీ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atchannaidu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారికి లేఖ రాశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు.. పర్చూరి ఎమ్మెల్యే సాంబశివరావుపై రెవెన్యూ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.. ఇక, ఈసీకి అచ్చెన్నాయుడు రాసిన లేఖలో ప్రస్తావించిన విషయాల్లోకి వెళ్తే.. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు అధికార పార్టీ ఓట్ల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నారు. మొత్తం ఓట్లలో దాదాపు 20 శాతం ప్రతిపక్షాల ఓట్లు తొలగించాలని అధికార పార్టీ కుట్రలపై పోరాడుతున్నారు. పెద్దఎత్తున ఫామ్-7, ఫామ్-6ల నమోదు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు సాంబశివరావు ఫిర్యాదులు చేశారు. దీనితో అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (APDRI) అధికారులు పర్చూరు ఎమ్మెల్యేపై కక్ష సాధింపులకు దిగారు. సాంబశివరావు వ్యాపారాలపై, ఆస్తులపై దాడులు మొదలు పెట్టి తప్పుడు కేసులు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
Read Also: Sai Pallavi : చెల్లెలి ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి కట్టిన చీర ధర ఎంతో తెలుసా?
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఇక, సాంబశివరావు కంపెనీలో పనిచేసిన ఉద్యోగి నోట్‌బుక్‌లో 2019 ఎన్నికల్లో సాంబశివరావు నగదు పంపిణీ చేసినట్లుగా ఆధారాలు దొరికాయని డీఆర్‌ఐ అధికారులు చెబుతున్నారు. సాంబశివరావు కంపెనీ సేల్స్ టాక్స్ చెల్లించలేదనే నెపంతో ఆయన కంపెనీపై అన్యాయంగా దాడులు చేశారు. ఈ దాడులు ఎమ్మెల్యే సాంబశివరావు ప్రతిష్టను దిగజార్చడమే. గతంలో ఇదే రెవెన్యూ అధికారులు సాంబశివరావు కంపెనీలో పనిచేసిన ఉద్యోగులపై ఒత్తిడి చేసి ఎమ్మెల్యే అక్రమ మార్గంలో నగదు సంపాదించినట్లు చెప్పాలన్నారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై కోర్టులో కేసు కూడా ఉంది. రెండు, మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సంధర్బంలో ఎమ్మెల్యే రెవెన్యూ అధికారుల దాడులు అధికార దుర్వినియోగమే. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేసేందుకు అధికారాన్ని ఉపయోగించడం దుర్మార్గం. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు చేస్తున్న అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!