ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా నిన్నటి సీన్ రిపీట్ అయింది. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ సభ్యులు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. దీంతో, పొత్తులపై ఆయా పార్టీలు చర్చలు ముమ్మరం చేస్తున్నాయి.. ఏపీలో ఇప్పటికే బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉందని.. రెండు పార్టీల నేతలు చెబుతున్నారు.. మరోవైపు.. టీడీపీ-జనసేన మధ్య కూడా పొత్తు కుదిరింది
త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరపనున్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందంటున్నారు.. ఎనిమిదో తేదీన భేటీ కావాలని చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ డిమాండ్ చేసింది.