VellamPalli Srinivas vs Bonda Uma: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బెజవాడలో ఆరోపణలు, విమర్శల్లో ఘాటు పేరుగుతోంది.. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.. ఇక, ఈ రోజు తన వ్యాఖ్యల్లో మరింత ఘాటు పెంచాడు బోండా ఉమామహేశ్వరరావు.. పశ్చిమంలో వెల్లంపల్లిని చందాల శ్రీను అని పిలుస్తారన్న ఆయన.. కరోనా వెల్లంపల్లికి పండుగ… 9 కోట్లు వ్యాపారుల దగ్గర వసూలు చేశాడు.. చందాల శ్రీను దెబ్బకి వ్యాపారులంతా కుదేలయిపోయారు.. వెల్లంపల్లి ఇంటి మీద రైడ్ చేస్తే దుర్గగుడికి భక్తులిచ్చిన నగలు దొరుకుతాయన్నారు. గోడలు దూకి అరెస్టు చేసే సీఐడీకి వెల్లంపల్లి ఇంటిపైకి వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఇప్పటి దాకా కుక్కర్లు, డబ్బులు పంపకంపై చర్యలు లేవన్న ఆయన.. నేను కుక్కర్లు, డబ్బులు పంపకంపై కోర్టుకు వెళ్తున్నాను.. 2000 కుక్కర్లు వన్ టౌన్ లో ప్రెస్టీజ్ కుక్కర్ల హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్ ను బెదిరించి తెచ్చాడు వెల్లంపల్లి అని ఆరోపించారు. వెల్లంపల్లి శ్రీను, రుహుల్లా, డిప్యూటీ మేయర్ లపై సత్యనారాయణ పురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాం.. మిగతా పీఎస్‌లకు రిజిష్టరు పోస్టు ద్వారా కంప్లైంట్ ఇచ్చాం అన్నారు. లేపేస్తా, తాటతీస్తా అని పనికిమాలిన ప్రేలాపనలు గతంలో లేవు.. కాపుల గొంతు కోసింది చంద్రబాబు అని నేను అన్నట్టుగా కల్పితాలు ప్రచారం చేస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు.. నేను 4 గంటలకు నిద్ర లేస్తాను… 6 గంటల నుంచి ప్రజలకు దగ్గరగా ఉంటానని పేర్కొన్నారు టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.
Read Also: Recession In Tech: “మాంద్యం” గురించి మాట్లాడితే ఉద్యోగం నుంచి తీసేశారు భయ్యా.. ఓ టెక్కీ ఆవేదన..
ఇక, భాను నగర్ 28వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ సమన్వయ కర్త వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి, డివిజన్ ఇంఛార్జి కొండా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ.. బోండా ఉమా ఐదేళ్ల నుండి ఎక్కడ దాక్కున్నాడో ఎవరికి తెలియదు అని ఎద్దేవా చేశారు.. మానసిక ఒత్తిడితో టీడీపీ నేత బోండా ఉమా ఇబ్బంది పడుతున్నారు.. సీఎం వైఎస్ జగన్ కి ఉన్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకపోతున్నాడు.. వ్యక్తిగతంగా మాట్లాడటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఉదయం 11 గంటలకు లేచే వాడు బోండా ఉమ… ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తాడు? అని సెటైర్లు వేశారు. ఇప్పుడు చంద్రుడిని చూస్తున్న వ్యక్తికి త్వరలోనే సూర్యుడిని చూపిస్తానని పేర్కొన్నారు.. కాపులకు గొంతు కోసింది చంద్రబాబు అని చెప్పింది నువ్వు కదా బోండా ఉమా? అని నిలదీశారు. సిగ్గు లేకుండా చంద్రబాబుతో ఎలా తిరుగుతున్నావు.. ఈ ప్రాంతంలో పేద ప్రజలకు అమరావతిలో స్థలాలు కేటాయిస్తే, స్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. ఓట్ల కోసం ఇళ్ల వద్దకు వస్తే చెప్పులు, చీపుర్లతో కొట్టడానికి మహిళల సిద్ధంగా ఉన్నారు అని హెచ్చరించారు వెల్లంపల్లి శ్రీనివాస్.