TDP-Janasena Alliance: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు చేస్తున్నారు. Also…
కేశినేని నానిపై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారని ఆయన అన్నారు. కేశినేని నాని దెబ్బకు వైసీపీలో ఓ వికెట్ పడిందన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదు..అలాంటి నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరంగా జరిగారని ఆరోపించారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో కార్యకర్తలు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. 'సిద్ధం' పోస్టర్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు.
బెజవాడ పశ్చిమలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెజవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇవ్వాలని.. ఇవాళ ర్యాలీ బల ప్రదర్శన కాదు మైనార్టీల వాయిస్ అని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ, కాంగ్రెస్, టీడీపీకి మేం చెప్పేది ఒక్కటే.. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు.. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు, నాయకులు చేసి బీజేపీపై విమర్శలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
చంద్రబాబు ఇచ్చే దరఖాస్తును అమ్మవారి ఎదుట ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు బుద్దా వెంకన్న.. ఇక, ర్యాలీ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టికెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తానని హెచ్చరించారు. చంద్రబాబు నాకు దైవ సమానులు. చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చాను. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు
Ponguleti: టీడీపీ కృషి మరువ లేనిదని, కాంగ్రెస్ గెలుపు కోసం నిద్ర పోకుండా పని చేశారని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సీపీఐ, టీడీపీ, ప్రజాపంథా కార్యాలయాలకు వెళ్లి ఆత్మీయ సమావేశాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ నిద్ర పోకుండా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేశారని అన్నారు. అహంకార పూరిత ప్రభుత్వంను ఓడించేందుకు టీడీపీ కృషి మరువ లేనిదన్నారు. జిల్లా రాజకీయాల్లో…