Chelluboina Venugopala Krishna: పవన్ కల్యాణ్ ఆశయం ఎవరికీ తెలియదు.. బీజేపీతో పొత్తు అంటారు.. టీడీపీతో కలిసి తిరుగుతారు.. పవన్ పెట్టిన పార్టీలో ఆశయం ఎక్కడా కనిపించడంలేదని ఫైర్ అయ్యారు మంత్రి వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాపు నేత ముద్రగడ కుటుంబాన్ని తీవ్రంగా హింసించిన చంద్రబాబుతోనే ఇప్పుడు పవన్ కలిసి వెళ్తున్నారు.. చంద్రబాబు ఏనాడు రాష్ట్రంలో సంపద సృష్టించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ సుబ్బారావు చెప్పారని గుర్తుచేశారు. ఇక, పవన్ కల్యాణ్ ఆశతో పార్టీ పెట్టారో.. ఆశయం కోసం పెట్టారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.. ఆశయాలతో వచ్చిన పార్టీలనే ప్రజలు నమ్ముతారని హితవుపలికారు.
Read Also: India Squad: చివరి మూడు టెస్టులకు భారత్ జట్టు ప్రకటన.. కోహ్లీ ఔట్, ఆకాష్ ఇన్!
స్వాతంత్రం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ అత్యాశకు పోయి కుప్పకూలిపోయిందని ఎద్దేవా చేశారు వేణుగోపాలకృష్ణ.. మంచి ఆశయాలతో ప్రారంభమైన ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు నాశనం చేశారని ఫైర్ అయిన ఆయన.. కాపు సామాజిక వర్గాన్ని ఆదుకోవాలనే ఆశయంతో చిరంజీవి పార్టీ ప్రారంభించారు.. రాజ్యసభ దక్కించుకోవాలని ఆశతో పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారని దుయ్యబట్టారు. ఇక, తండ్రి ఆశయాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రారంభించారు.. ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్, తండ్రి ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని విస్తృతం చేసి చూపించారు సీఎం జగన్ అని ప్రశంసలు కురిపించారు.. రాష్ట్రంలో పేదరికం 16 శాతం నుండి నాలుగు శాతానికి తగ్గింది.. పవన్ పెట్టిన పార్టీలో ఆశయం ఎక్కడా కనిపించలేదన్నారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. ప్రజలతో ప్రశ్నించుకునే స్థాయికి వెళ్లిపోయారంటూ సెటైర్లు వేశారు మంత్రి వేణుగోపాలకృష్ణ.