Yanamala Ramakrishnudu: జగన్ రెడ్డి పాలనలో బడ్జెట్ కేటాయింపులకు విలువ లేదు అని విమర్శించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. ఆరు విధ్వంసకర ఆర్ధిక విధానాలతో రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేశారని ఆయన. బ్యాడ్ డెట్, హై కరెప్షన్, హై ఇన్‌ప్లేషన్, హై అన్ ఎంప్లాయ్‌మెంట్, హై డెఫిసిట్స్, సిస్టమ్స్ కొలాప్స్ అనే విధానాలే రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్నారు. రాష్ట్ర ఆర్ధిక దుస్థితిపై అసెంబ్లీ సాక్షిగా చేదు నిజాలను దాచిపెట్టి రాష్ట్ర ప్రజలను మసిపూసి మారేడు కాయ చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. జగన్ రెడ్డి పాలనలో బడ్జెట్ కేటాయింపులకు విలువ లేదు. 2022-23 ఏడాది రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి తెచ్చిన తాత్కాలిక అప్పులతోనే నడిపిందని ఆరోపించారు.
Read Also: CM Revanth: మీరెప్పుడు రైతుబంధు ఇచ్చారు..? మేము వచ్చి 60 రోజులు కూడా కాలేదు
ఏడాదిలో 365 రోజుల్లో 24 రోజులు తప్ప మొత్తం ఏడాది చేబదుళ్లతోనే గడిచిందని విమర్శించారు యనమల.. ఓడీ 152 రోజులు తీసుకున్నారు. అసెంబ్లీకి చెప్పకుండా తెచ్చిన రూ.5 లక్షల కోట్ల రుణాలు, ఆర్బీఐ నుంచి తీసుకున్న తాత్కాలిక అప్పులు రూ.1,18,039 కోట్లు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021-22 లో 11,22,837 కోట్లు ఉండగా 2022-23 లో 13,17,728 కోట్లకు పెరిగిందని తప్పుడు లెక్కలు చెబుతున్నారని దుయ్యబట్టారు.. ఖర్చు చేయకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (ఎస్.జీఎస్టీ) ఎలా పెరుగుతుంది? అని నిలదీశారు. జగన్ రెడ్డి పాలనలో పేదలు మరింత పేదలయ్యారన్న ఆయన.. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో మన రాష్ట్రం స్థానం ఎక్కడో చెప్పకుండా పేదరికం తగ్గిందని చెప్పడం అవివేకం అవుతుందన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మన రాష్ట్రంది 13 వ స్థానం. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో మనది 20 వ స్థానం.. మన కంటే వనరులు తక్కువైన పొరుగు రాష్ట్రం తెలంగాణ.. ఏపీ కంటే మెరుగ్గా 21 స్థానంలో నిలిచిందని తెలిపారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు.