ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. మైలవరం నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. గతంలో నందిగామ ఎస్సీ రిజర్వు చేయటంతో మైలవరానికి వచ్చాను గుర్తుచేసుకున్నారు.. గత ఆరేళ్లుగా మైలవరం నుంచే పనిచేస్తున్నా, ఇక్కడే ఉంటాను అని స్పష్టం చేశారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడం పక్కా అనే సంకేతాలు ఇచ్చారు.. కానీ, నిద్ధిష్టమైన నిర్ణయం త్వరలోనే చెబుతాను అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్ కల్యాణ్ వెంట నడవడం లేదన్న ఆయన.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుండి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని సూచించారు.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే గవర్నర్ ప్రసంగం నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో టీడీపీ సభ్యులు బైఠాయించేందుకు ప్రయత్నం చేశారు.
నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేరం జరిగిన తీరు పట్ల మంత్రి కాకాణికి అవగాహన లేదని, ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఆయన పాత్ర లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే నెల్లూరు కోర్టులో బ్యాగు చోరీకి గురైందని తెలిపారు.…
మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా నా తలరాత రాసింది జగన్మోహన్ రెడ్డి.. ఆయన బంటుగా వైసీపీ విజయం కోసం త్యాగానికి సిద్ధం అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. పార్టీ తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా తాను సిద్దమని తెలిపారు. జగన్ చెప్పిన స్టార్ క్యాంపెయినర్ లో అమర్నాథ్ ఒకడు అని అన్నారు. జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం అని చెప్పారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ.. సీఎం…
చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ తో భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన.. ఈ అంశంపై చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో.. జనసేనకు ఎంత సీటు షేర్ ఇవ్వాలి.. ఏఏ నియోజకవర్గాలకు సంబంధించి గెలుపువకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు…
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. కాగా.. ఏపీ పదిహేనవ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు.